ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.34
సూర్యాస్తమయం: సాయంత్రం 05.36
రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు
అమృత ఘడియలు: ఉ.9.15 ల10.15 సా4.40 ల6.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రాణాలు చేయాల్సి ఉంటుంది.ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడమే మంచిది.
వృషభం:

ఈరోజు మీకు అనుకొని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.బంధుమిత్రులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కొన్ని చెడు సవాసాలకు దూరంగా ఉండడమే మంచిది.విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.కొన్ని దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.
కర్కాటకం:

ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయంలో ఎక్కువ కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
సింహం:

ఈరోజు మీరు ప్రారంభించే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడమే మంచిది.
కన్య:

ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.
తులా:

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి దైవదర్శనాలు చేసుకుంటారు.బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
వృశ్చికం:

ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ధనస్సు:

ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.మీరు ఏ పని ప్రారంభించిన అంతా అశుభమై జరుగుతుంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతులు అందుతుంది.కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
మకరం:

ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.ఇతరుల నుండి రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కుంభం:

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.మీలో బలహీనత ఈరోజు ఎక్కువగా ఉంటుంది.మానసిక ఆందోళనతో సతమతమవుతారు.
మీరు చేసే పనిలో విశ్రాంతి దొరకదు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మీనం:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.