ముఖ్యంగా చెప్పాలంటే సూర్య, చంద్ర గ్రహణాలు( Solar , lunar eclipses ) అనేవి ఖగోళ సంఘటనలు అని నిపుణులు చెబుతున్నారు.ఈ రోజు సూర్యగ్రహణం ఏర్పడబోతోంది.
చంద్రుడు పాక్షికంగా లేదా పూర్తిగా సూర్యుడిని కప్పి భూమిపై నీడను పడకుండా చేస్తాడు.అయితే సూర్యగ్రహణం సమయంలో వెలువడే కిరణాలు హానికరమైనవి అని, ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపుతాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
ముఖ్యంగా హిందువులు గ్రహణం ఏర్పడే సమయాన్ని సుతా కాలంగా భావిస్తారు.గ్రహణ సమయంలో బయటకు వెళ్లడానికి అస్సలు ఇష్టపడరు.
అంతేకాకుండా ఆహారం వంటివి తీసుకోకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటారు.

మరోవైపు సూర్యగ్రహణం ఏర్పడే సమయంలో ఏర్పడే ప్రతికూలతను తొలగించడానికి కొందరు ప్రత్యేకమైన ప్రార్ధనలను చేస్తారు.అలాగే కొన్ని ఆచరణ, నియమాలను కూడా పాటిస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే సూర్యగ్రహణం ఆరోగ్యం పై చూపే ప్రభావాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యగ్రహణం సమయంలో అత్యంత ముఖ్యమైన ఆరోగ్య ప్రమాదం కంటిచూపు( Eyesight ) అని నిపుణులు చెబుతున్నారు.సూర్య గ్రహణ సమయంలో సూర్యుడిని నేరుగా చూడడం వల్ల సోలార్ రెటినోపతితో( solar retinopathy ) సహా తీవ్రమైన కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

సూర్యగ్రహణ సమయంలో భూమి ఉపరితలంపై చేరే అతినీల లోహిత కిరణాల రేడియేషన్( Ultraviolet radiation ) లో పెరుగుదల ఉంటుంది.ఈ కిరణాల స్థాయి ఎక్కువగా ఉండడంతో చర్మం దెబ్బ తినే అవకాశం ఉంది.అలాగే వడదెబ్బ, స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.సూర్యగ్రహణం సమయంలో గ్రహణాన్ని చూడడం అసలు మంచిది కాదు.ఒకవేళ చూడాలని అనుకుంటే సూర్యరశ్మి నుంచి కంటి చూపును రక్షించుకోవడం కోసం కంటి అద్దాలు వంటి వాటిని రక్షణ కోసం ఉపయోగించడం మంచిది.అయితే రెగ్యులర్ గా ఉపయోగించే సన్ గ్లాసెస్ సూర్యగ్రహణాన్ని చూడడానికి ఉపయోగించకూడదు.
ఈ కంటి అద్దాలు తీవ్రమైన సూర్యకాంతి నుంచి తగిన రక్షణను కంటి రెప్పకు ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది.