ప్రస్తుత ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి డబ్బును ఎలా సంపాదించాలి అనే ఆలోచనలోనే ఉన్నాడు.ఎందుకంటే జీవితంలో డబ్బుకున్న ప్రాధాన్యత అటువంటిది మరి.
ప్రతి వ్యక్తి జీవితంలో కష్టపడి పని చేసేది డబ్బు కోసమే అనీ ఖచ్చితంగా చెప్పవచ్చు.అయితే అన్నిసార్లు అందరూ కష్టానికి తగిన ఫలితాన్ని పొందలేరు.
ఒకవేళ డబ్బు సంపాదించగలిగిన అది నిలబడదు.ఎంత ప్రయత్నం చేసినా ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరం కావు.
ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసం మన సనాతన ధర్మశాస్త్రాలలో( Sanatana Dharmashastras ) చాలా రకాల పరిహారాలు ఉన్నాయి.

ఒక చిన్న మట్టి కుండా తీసుకోవాలి.ఇందులో రూపాయి నాణేలు 5 ఉంచాలి.వాటితో పాటు బియ్యం, గోధుమలు, బార్లీ( Rice, wheat, barley ) వంటి ఇతర ధాన్యంతో కలశం నింపాలి.
ఎర్రటి వస్త్రంతో కప్పి దారంతో కట్టి మూసేయాలి.ఇప్పుడు దీన్ని లక్ష్మీ పూజలో ఉంచాలి.ఆ తర్వాత డబ్బు దాచే ప్రదేశంలో ఉంచాలి.ఇలా చేయడం వలన కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలను చూడవచ్చు.
రోజులు గడిచే కొద్ది కాలం కలిసి రావచ్చు.ఇంకా చెప్పాలంటే కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దాన్ని దారంతో కట్టాలి.
ఇప్పుడు ఆ కొబ్బరికాయలు లక్ష్మి పూజలో ఉంచి పూజ చేయాలి.

ఆ తర్వాత దాన్ని డబ్బు దాచే చోట ఉంచాలి.ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం( Grace of Lakshmi ) తప్పక ఉంటుందని పండితులు చెబుతున్నారు.అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి పూజ చేసుకొని పసుపు వేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఇంటికి రమ్మని ఆహ్వానించాలి.
ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో లక్ష్మి పూజ చేసుకోవాలి.గులాబీ పువ్వులు గులాబీ మాలను అమ్మవారికి సమర్పించాలి.ఇలా వరుసగా 11 శుక్రవారలు తప్పకుండా చేయాలి.ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు.
ఇంకా చెప్పాలంటే చాలామంది నీటి వృథాను అసలు పట్టించుకోరు.కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం అనే పండితులు చెబుతున్నారు.
నీటిని వృధా చేయకూడదు.నీరు వృధా జరిగే చోట లక్ష్మీదేవి ఉండదు.