ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో యుద్ధమేఘాలు అలుమ్ముకున్నాయి. ఇజ్రాయెల్.
ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది.గత ఏడాది అక్టోబర్ 7వ తారీఖు నుండి ఇజ్రాయెల్ తన శత్రువులపై విరుచుకుపడుతూ ఉంది.
అక్టోబర్ 7వ తారీఖు నాడు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ దేశంలో అక్రమంగా చొరబడి ఇజ్రాయెల్ పౌరులపై విచక్షణ రహితంగా దాడులు చేశారు.ఈ దాడులలో వందలాదిమంది ఇజ్రాయెల్ పౌరు( Israel )లు మరణించడం జరిగింది.
ఇదే సమయంలో మిలిటెంట్లు ఇజ్రాయెల్ పౌరులను కొంతమందిని కిడ్నాప్ కూడా చేయడం జరిగింది.
దీంతో అప్పటినుండి తమ దేశ పౌరులను రక్షించుకోవడానికి గాజాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకు పడటం జరిగింది.రాఫా వంటి నగరాలలో ఉగ్రవాదులు ఉంటారని.ఆ ప్రాంతంపై కూడా దాడులు చేస్తూ ఉంది.
ఈ దాడులలో చాలామంది సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలో యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యహుతో పాటు హమాస్ నాయకులపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ నేరా న్యాయస్థానం చీఫ్ ప్రోసిక్యూటర్ కరీమ్ ఖాన్( Karim Khan ) కోరారు.
హమాస్ తో యుద్ధంతో పాలస్తీనీయులు నిరాశ్రుయులయ్యారని ఇజ్రాయెల్ పై విమర్శలు వస్తున్నాయి.దీంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ( Benjamin Netanyahu)వ్యవహరిస్తున్న తీరుపై అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో పిటీషన్లు దాకాలు అవుతున్న క్రమంలో.
కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.