సాధారణంగా ఎండాకాలంలో ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత చల్లటి కొబ్బరి నీళ్ళు తాగితే చాలా హాయిగా అనిపిస్తుంది.అలాగే వేసవి తాపం నుంచి రక్షించడంలో కూడా కొబ్బరి నీళ్ళు సహాయపడతాయి.
అయితే కొన్ని ప్రాంతాల్లో తాజా కొబ్బరి బోండాలు కాకుండా ప్యాక్డ్ లేదా క్యాన్డ్ నీళ్లు కొబ్బరి నీళ్లు అందుబాటులో ఉంటాయి.అయితే ఇలా ప్యాక్డ్ కొబ్బరి నీళ్లు తాగవచ్చా? లేదా? అన్న సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది.ట్యాగ్ చేసిన కొబ్బరి నీళ్లలో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.ఇక ఆస్ట్రేలియన్ చట్టం ప్రకారం ఈ కొబ్బరి నీళ్లను ప్యాక్ చేసే ముందు పాశ్చరైస్ చేయాలి.
ఎందుకంటే ఇది భద్రతకు చాలా అవసరం.

ఎందుకంటే కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత ఆ నీళ్లు ఆక్సికరణం చెందుతాయి.దీంతో అందులోకీ బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది.కాబట్టి పాశ్చరైస్( Pasteurization ) ద్వారా బ్యాక్టీరియాని తొలగిస్తారు.
అయితే ఈ ప్రక్రియ తాజా కొబ్బరి నీళ్ల నుంచి మాత్రమే లభించే పోషకాలు, ఎలక్ట్రోలైట్లను కూడా ఇది నాశనం చేస్తుంది.ఎందుకంటే ప్యాక్ చేసే ముందు కొబ్బరినీళ్లు ఒక నిమిషం పాటు వేడి చేస్తారు.
ఇక కొన్ని కంపెనీలు వాటిని నాలుగు నిమిషాల పాటు వేడి చేస్తారు.ఇలా చేయడం వలన షుగర్ కంటెంట్ మరింత పెరుగుతుంది.
అయితే ప్యాక్డ్ కొబ్బరి నీళ్లను తాగడం కన్నా తాజా కొబ్బరినీళ్ళలను తాగడం వలన ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి.

తాజా కొబ్బరి నీళ్లలో క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, మాంగనెస్, ఐరన్, జింక్, సెలీనియం ఉంటాయి.ఇక తాజా కొబ్బరి నీళ్లలో విటమిన్ B2( Vitamin B2 ) ఉంటుంది.కానీ ప్రాసెస్ చేసిన కొబ్బరి నీటిలో మాత్రం ఉండదు.
తాజా కొబ్బరి నీళ్లలో గ్లూకోస్, సుక్రోజ్ ఉంటాయి.కొబ్బరినీళ్లు పునరుత్పత్తి వ్యవస్థ పై ప్రభావాన్ని చూపిస్తాయి.
అయితే తాజా కొబ్బరి నీళ్ళు చాలా ఆరోగ్యకరమైనవి.ప్యాక్ చేసిన కొబ్బరినీళ్ళ కన్నా అదే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అందుకే ప్యాకెట్ చేసిన కొబ్బరి నీళ్లను తాగే కన్నా తాజా కొబ్బరి నీళ్లను తాగడమే మంచిది.