నల్లగొండ జిల్లా:చేనేత కార్మికుల సమస్యలు( handloom workers ) పరిష్కరించాలని కోరుతూ చేనేత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేనేత కార్మికులు సోమవారం నల్లగొండ జిల్లా చండూరు తహశీల్దార్( Tehsildar ) దశరథకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.
చేనేత త్రిప్ట్ ఫండ్,చేనేత మిత్ర పథకాలతో పాటు ఇతర పథకాలను కొనసాగించి, పూట గడవని స్థితిలో ఉన్న నేత కార్మికులకు త్రిఫ్ట్ కాల పరిమితి మేరకు ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి చేనేతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.పని భరోసా కల్పించేందుకు ప్రింటెడ్ చీరలను అరికట్టాలని,సంఘాలను బలోపేతం చేసి చేనేత చీరలను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.
60 ఏళ్లు దాటిన నేత కార్మికులకు 5లక్షల జీవిత బీమా( 5 lakh life insurance ) తక్షణమే వచ్చేలా చూడాలని,బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎస్ అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్,పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు గుర్రం బిక్షమయ్య,గౌరవ అధ్యక్షుడు పులిపాటి ప్రసన్న,ట్రస్ట్ చైర్మన్ కోమటి వీరేశం,రాపోలు శ్రీనివాస్, కర్ణాటీ శ్రీనివాసులు, రాపోలు వెంకటేశం,ఏలే శ్రీను,సంగెపు శీను,చెరిపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.







