నటి పవిత్ర లోకేష్.ఇటీవల కాలంలో పెళ్లి అనే విషయంలో బాగా వివాదం అయ్యి మీడియా, సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా ప్రచారం పొందింది.
మొదట్లో కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఇప్పుడు తల్లి పాత్రల్లో కనిపిస్తుంది.అయితే ఎటొచ్చి ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం చాల వివాదాలతో నిండి ఉంది.
ఆమె తండ్రి కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తి కావడం తో ఆమెకు సినిమాల్లో త్వరగానే ఎంట్రీ దొరికింది.చిన్నప్పటి నుంచి ఇంటి బాధ్యతను ఆమెనే తీసుకొని బి గ్రేడ్ సినిమాల్లో కూడా నటించింది.
ఇక ఆమె లోకేష్ అనే దర్శకుడితో పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు కొడుకులకు జన్మ ఇచ్చింది.
అయితే సీనియర్ తెలుగు హీరో నరేష్ తో ఆమె చాల రోజులుగా సన్నిహితంగా ఉండటం తో అది పెద్ద గొడవకు దారి తీసింది.
నరేష్ మూడో భార్య మీడియాకి ఎక్కి రచ్చ చేసింది.ఇక ఈ విషయాలన్నీ కాసేపు పక్కన పెడితే పవిత్ర లోకేష్ తన జీవితం మొత్తంలో బాగా పేరు వచ్చిన, సంతృప్తి పొందిన పాత్ర ఏదైనా ఉంది అంటే అది నాయి నెరళు నవల ఆధారం గా తెరకెక్కిన సినిమా.
నాయి నెరళు అనే కుక్క నీడ .ఇది మనిషి యొక్క పునర్జనంలా నేపథ్యం గా వచ్చింది.అయితే ఈ చిత్రంలో పవిత్ర లోకేష్ భర్త 20 ఏళ్ళ క్రితం చనిపోయి మళ్లి జన్మిస్తాడు.తన కూతురు వయసున్న ఒక యువకుడు తన భర్త రూపంలో వచ్చి నేను నీ భర్తను అంటూ వస్తాడు.
2006 లో గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో గుండు కొట్టించుకొని విధవరాలు పాత్రలో ఉన్న మహిళా తిరిగి వచ్చిన భర్త కోసం మళ్లి పుణ్యశ్రీ గా మారుతుందా లేదా అనే ఇతివృత్తంతో తెరకెక్కింది.ఇక ఈ సినిమాలో పవిత్ర ప్రధాన పాత్రలో నటించింది.అందుకు గాను ఆమెకు కర్ణాటక రాష్ట్రం తరపున ఉత్తమ నటిగా పురస్కారం దక్కించుకుంది.నిజంగా ఈ సినిమాలో పవిత్ర నటన అద్భుతం.జాతీయ స్థాయిలో సైతం ఉత్తమ నటి గా నామినేట్ అయినా తృటిలో అవార్డు ని మిస్ అయ్యింది పవిత్ర.అలాంటి పాత్రలు మళ్లి మళ్లి పుడతాయో లేదో తెలియదు కానీ కన్నడ సినిమా పరిశ్రమ మాత్రం ఇలాంటి సినిమాలు నవలల ఆధారంగా తీయడం మాత్రం మానలేదు.