శరీర దుర్వాసనను పోగొట్టటానికి నిమ్మరసం ఒక చవకైన మార్గం అని చెప్పవచ్చు.నిమ్మరసం శరీర దుర్వాసన మీద పోరాటం చేస్తుంది.
చర్మం మీద ఉండే చెమట ఆహారంగా తీసుకొనే సూక్ష్మజీవుల వృద్ధిని అరికట్టటం మరియు ఫౌల్ వాసనలు కల వాయువుల ఉత్పత్తిని విడకోట్టటంలో నిమ్మరసం సహాయపడుతుంది.ఇప్పుడు నిమ్మరసం శరీర దుర్వాసన మీద పోరాటం చేసే మార్గాలను తెలుసుకుందాం.
1.నిమ్మరసంనిమ్మరసంను చంకలలో మరియు పాదాలలో రాసినప్పుడు కొంచెం చికాకు కలుగుతుంది.అందువల్ల నిమ్మరసంలో కొంచెం నీటిని కలపాలి.ఒక స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ నీటిని కలిపి ప్రభావిత ప్రాంతాల్లో రాయాలి.
2.నిమ్మరసం మరియు బేకింగ్ సోడానిమ్మ రసం మరియు బేకింగ్ సోడా మిశ్రమం శరీర దుర్వాసనను తగ్గించటంలో సహాయపడుతుంది.చంకలలో మరియు పాదాలలో చెమట శోషణకు సహాయపడుతుంది.చర్మం సహజ pH స్థాయిలను పునరుద్ధరించడం ద్వారా దుర్వాసనకు కారణం అయిన సూక్ష్మజీవుల వృద్ధిని తగ్గిస్తుంది.నిమ్మరసంలో బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి పది నిముషాలు అయ్యాక సాదారణ నీటితో కడగాలి.
3.నిమ్మరసం మరియు విచ్ హాజెల్శరీర దుర్వాసన వదిలించుకోవటానికి నిమ్మరసం మరియు విచ్ హాజెల్ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో రాయాలి.
విచ్ హాజెల్ బాక్టీరియా పెరుగుదలను అణచివేయటానికి మరియు చర్మం యొక్క pH స్థాయి తగ్గించడంలో సహాయపడుతుంది.అంతేకాక చెమటను తగ్గించటంలో కూడా సహాయపడుతుంది.రెండు స్పూన్ల నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ విచ్ హాజెల్ వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని చంకలలో మరియు పాదాల కింద రాయాలి.
4.నిమ్మరసం మరియు టీ ట్రీ ఆయిల్ టీ ట్రీ ఆయిల్ ఒక సహజ క్రిమినాశకంగా పనిచేసి చర్మ ఉపరితలం మీద నివసించే బ్యాక్టీరియాను చంపటానికి సహాయపడుతుంది.
టీ ట్రీ ఆయిల్ తో నిమ్మ రసం కలిపితే చెమటకు కారణం అయిన బ్యాక్టీరియా వృద్ధిని నియంత్రించి శరీర దుర్వాసనను తగ్గిస్తుంది.రెండు స్పూన్ల నీటిలో రెండు స్పూన్ల నిమ్మరసం,రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపాలి.