శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న..

కలియుగ వైకుంఠం అని పేరు ఉన్న తిరుమల పుణ్య క్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనం ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది.ఈ నెల రెండవ తేదీ నుంచి ముక్కోటి ఏకాదశి జరుపుకునే విధంగా కోట్లాది మంది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఉత్తర ద్వారం గుండా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించారు.

 Ttd Board Good News For Tirumala Devotees Details, Ttd Board Good News ,tirumala-TeluguStop.com

అదే సమయంలో ఎప్పుడు ఎప్పుడ అంటూ ఎదురు చూస్తున్నా కోట్లాదిమంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు టిటిడి అధికారులు మరో శుభవార్త చెప్పారు.తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన 300 రూపాయల టికెట్లను విడుదల చేస్తున్నామని వెల్లడించారు.

వాటిని ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకుని వస్తున్నామని తెలిపారు.

ఈ నెల 9వ తేదీ టీటీడి అధికారులు ఈ టికెట్లను భక్తుల కోసం విడుదల చేసే అవకాశం ఉంది.ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కొనసాగుతున్నందున ఈనెల రెండవ తేదీ నుంచి శ్రీవారి ప్రత్యేక దర్శన కూడా టికెట్లను టీటీడి అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే.12వ తేదీ వరకు స్పెషల్ దర్శనాలు కూడా ఉండవు.ఈ విషయాన్ని టీటీడి అధికారులు ముందుగానే ప్రకటించారు.

ఈ పది రోజుల వైకుంఠ ఉత్తర ద్వారదర్శనం 12వ తేదీన ముగుస్తుందని అదే రోజు నుంచి 300 రూపాయల ప్రత్యేక దర్శనాన్ని ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు.ఈ దర్శనానికి అవసరమైన టికెట్లను రెండు రోజుల ముందుగానే ఆన్లైన్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి వాటిని విడుదల చేస్తారు.ఈనెల 31వ తేదీ వరకు కోటా టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.ఈ టికెట్లను కొని శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని వెల్లడించారు.ఇంకా చెప్పాలంటే సీనియర్ సిటిజన్లు, వికలాంగుల కోట టికెట్లను శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ టికెట్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube