శనివారం రోజు శనీశ్వరునికి( Saturn ) అంకితం చేశారని పండితులు చెబుతున్నారు.కొంత మంది ప్రజలు శనీశ్వరుడిని న్యాయ దేవుడు అని కూడా పిలుస్తారు.
శని దేవుని ( Shani )ఆగ్రహానికి గురైన వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు.శని మనిషి కర్మను బట్టి ప్రతిఫలాన్ని ఇస్తాడు.
శనికి ఏ వ్యక్తిపైనా ఆగ్రహం ఉంటే ఆ వ్యక్తి తన జీవితంలో డబ్బు, వ్యాపారానికి సంబంధించి చాలా సమస్యలను ఎదుర్కొంటాడు.అంతేకాకుండా ఇంకా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇలాంటి పరిస్థితులలో శని దేవుడుని ప్రసన్నం చేసుకొని శనీశ్వరుడి కంటిచూపు మీ పై పడకుండా ఉండాలంటే శనివారం రోజు ఇలా చేయాలి.

పూజ సమయంలో దీపం వెలిగించడం ఎంతో ముఖ్యం.ఇంకా చెప్పాలంటే శని దేవుడినీ ప్రసన్నం చేసుకోవడానికి సాధారణంగా శనివారం రోజు ఆవనూనెతో దీపాలు వెలిగించాలి.ఈ దీపంలో లవంగాలు పెడితే అదృష్టాన్ని మార్చుకోవచ్చు.
ఈ దీపంలో లవంగాలు( cloves ) పెట్టడం వల్ల మీ వైపు డబ్బు ఆకర్షించబడుతుంది.దీని తో పాటు వ్యక్తి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
ఇలా ప్రతి శనివారం చేయడం వల్ల ధనానికి ఎటువంటి లోటు ఉండదని ప్రజలు నమ్ముతారు.

ఇంకా చెప్పాలంటే శనివారం సాయంత్రం తప్పకుండా ఆవాల నూనెలో దీపం( mustard oil ) వెలిగించడం ద్వారా శని దేవుడు సంతోషిస్తాడు.అలాగే శనివారం రోజు మనం తయారు చేసుకునే రోటీలో మొదటి రోటిని ఆవు కు చివరి రోటీ నీ కుక్క కు తినిపించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.అలాగే తినడానికి తిండి లేని పేదవారికి కూడా రోటీని తినిపించడం వల్ల కూడా అంతే పుణ్యం లభిస్తుంది.
ముఖ్యంగా చెప్పాలంటే శాస్త్రం ప్రకారం ఈ విషయాలను పాటించడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు.అలాగే పక్షులకు నీరు అందించడం, ఆహారం పెట్టడం కూడా ఎంతో మంచిది.