ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ 30వ తేదీన రాహు, కేతు, గ్రహ మార్పుల వల్ల తుల రాశి వారి జాతకంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి.మరి ఈ సమయంలో తుల రాశి( Libra ) వారి జీవితంలోకి ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ గ్రహాల రాశి మార్పు ప్రభావం అనేది అన్ని రాశుల జీవితాల పైన ఉంటుంది.రాహు, కేతువులు కేవలం నీడ గ్రహాలు మాత్రమే కాదు.
ఎప్పుడూ వాలుగా ఉండే స్థితిలో ప్రయాణిస్తాయి.ఈ గ్రహాల రాశులు మారడానికి 18 నెలల సమయం పడుతుంది.
ఈ సందర్భంగా అక్టోబర్ 30వ తేదీన రాహు, కేతు సంచారాలు జరగనున్నాయి.రాహువు మేషరాశి నుంచి మీన రాశిలోకి, కేతువు తుల రాశి( Libra ) నుంచి కన్య రాశిలోకి సంచరిస్తాయి.
ఈ రెండు గ్రహాల సంచారం అన్ని రాశులలోను కనిపిస్తున్నప్పటికీ ముఖ్యంగా తులా రాశి వారి జాతకంలో ఆకస్మిక ధన ప్రవాహం, ఈ సంచారం నుంచి అదృష్టాన్ని కూడా పొందుతారు.తుల రాశి వారికి ఈ సంచారం అదృష్టాన్ని తెస్తుంది.ముఖ్యంగా వ్యాపారులకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది.ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.నిరుద్యోగులు మంచి ఉద్యోగం( Job ) పొందుతారు.ఏది చేసినా అందులో విజయం సాధిస్తారు.
తర్వాత రాజకీయాలలో ఉన్న వారికి మంచి స్థితి వచ్చే అవకాశం ఉంటుంది.వీరికి సంగీత సాహిత్యలలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది.
వీరికి కోపం కూడా త్వరగా వస్తుంది.మాటమీద నిలబడే తత్వం వీళ్ల దగ్గర ఉండదు.
ఎంత సంపాదించినా దాన్ని వెంటనే ఖర్చు చేస్తారు.అందువల్ల వీరు తమ ఆస్తిని, సంపాదనను స్థిరాస్తులలోకి గనుక మార్చుకుంటే భవిష్యత్తులో వీరికి, వీరి కుటుంబానికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు.తుల రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ( Lakshmi Puja ) చేయడం మంచిదని పండితులు( Scholars ) చెబుతున్నారు.వీరికి గ్రహాధిపతి శుక్రుడు( Venus ) కాబట్టి శుక్రవారం పూట శుక్ర గ్రహానికి మంచి పరిహారాలు చేస్తే వీరి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
ఇంకా చెప్పాలంటే లక్ష్మీదేవికి కూడా ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం అనేది వీరి జీవితానికి శుభకరంగా మారుతుంది.తులా రాశి( Libra ) వారు శనివారం పూట ఆంజనేయ స్వామి ( Anjaneya Swami )వారి ఆలయానికి వెళ్లి అక్కడ నెయ్యితో దీపం వెలిగించి మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే మీకున్నటువంటి సమస్యలు అన్ని దూరమవుతాయి.