న్యూమరాలజీ ప్రకారం ఒక్కో తేదీకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది.ఒక్కో తేదీన పుట్టిన వారిపై కొన్ని సంఖ్యల ప్రభావం కచ్చితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ సంఖ్యల ఆధారంగానే వ్యక్తులకు ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తూ ఉంటారు.అలాగే పుట్టినది ఏ రోజు, ఏ వారం అనేదాన్ని బట్టి వ్యక్తుల గుణాలను, లక్షణాలను న్యూమరాలజీ నిపుణులు చెబుతూ ఉంటారు.
సంఖ్యాశాస్త్రం( Numerology ) ప్రకారం ఆదివారం రోజు పుట్టిన వారు జీవితంలో ఎలా ఉంటారు.జీవితంలో వారు ఏ రంగంలో విజయం సాధిస్తారు.
అలాగే వారు చేయవలసిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.న్యూమరాలజీలో ఆదివారం రోజు ను చాలా శక్తివంతమైన రోజుగా భావిస్తారు.
ఆదివారం రోజు పుట్టిన వారిపై నెంబర్ వన్ ప్రభావం ఉంటుంది.ఇది సూర్యభగవానుడిని సూచిస్తుంది.
ఆరెంజ్, ఎల్లో వీరికి లక్కీ కలర్స్ గా ఉంటాయి.అలాగే వీరి లక్కీ డే ఆదివారం( Sunday ).లక్కీ నంబర్స్ ఒకటి, మూడు.అదృష్ట లోహం బంగారు.
అదృష్ట దీశ తూర్పు.ఆదివారం రోజు పుట్టిన వారు స్వతంత్రంగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తారు.
వీరు ఎక్కువగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు.కళాత్మకంగా ఉండడంతో పాటు లీడర్షిప్ స్కిల్స్ వీరిలో ఉంటాయి.
తెలివైన ప్రాక్టికల్ నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు.
![Telugu Brokerage, Numerology, Sunday, Theater Actors, Vastu, Vastu Tips-Telugu B Telugu Brokerage, Numerology, Sunday, Theater Actors, Vastu, Vastu Tips-Telugu B](https://telugustop.com/wp-content/uploads/2023/05/According-to-numerology-these-are-the-characteristics-of-people-born-on-Sundayb.jpg)
వీరు అద్భుతమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు లక్ష్యాల కోసం ప్రయత్నించే ధైర్యం, ఇంటర్వ్యూలలో ఆకట్టుకునే గుణం విరి సొంతం.ఆదివారం రోజు పుట్టిన వారు ఎమోషనల్ కంట్రోల్ చేసుకునేందుకు పోరాటం చేస్తారు.విచిత్రమైన ఆలోచనలు ఎప్పుడు వీరి మనుషులు తిరుగుతూ ఉంటాయి.
ఆదివారం రోజు పుట్టిన వారికి సోలార్ ప్రొడక్ట్స్ తయారీదారులు, డీలర్లు, బ్రోకరేజ్ బిజినెస్, థియేటర్ యాక్టర్స్, టెక్నికల్ సపోర్ట్, ల్యాండ్ డీలర్స్, రీసెర్చ్ అండ్ అనాలసిస్, స్పోర్ట్స్ మాన్, బిల్డర్స్, డిఫెన్స్ లేదా ఎయిర్‌లైన్స్ సర్వీసెస్, కుటీర పరిశ్రమలు రాజకీయ రంగం, ఆహార పరిశ్రమలు ఆదివారం పుట్టిన వారికి అనువైన రంగాలని కచ్చితంగా చెప్పవచ్చు.
LATEST NEWS - TELUGU