ముఖ్యంగా చెప్పాలంటే సెప్టెంబర్ 18వ తేదీ సోమవారం రోజు మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు వినాయక చవితి( Vinayaka Chavithi festival ) పండుగను జరుపుకుంటున్నారు.అలాగే తులసీదళాన్ని వినాయకునికి ఎందుకు సమర్పించకూడదు.
దాని వెనుక ఉన్న అసలు కారణం చాలా మందికి తెలియదు.నాక్షతైః అర్చయేద్విష్ణుం న తులస్యా గణాధిపం!అనేది శాస్త్ర ప్రమాణం.
అక్షతలతో విష్ణు మూర్తికి, తులసీదళాలతో గణపతికి పూజ చేయకూడదని నియమం చెబుతోంది.వీరికి తులసి దళాన్ని వాడకపోవడానికి పురాణాలలో ఒక కథ ప్రచారంలో కూడా ఉంది.
హంసధ్వజుని పుత్రుడైన ధర్మధ్వజూనికి విష్ణువు( Vishnu ) అంశ వలన కలిగిన సంతానమే తులసి అని పండితులు చెబుతున్నారు.

ఈమె గంగానది తీరంలో విహరిస్తున్నప్పుడు అటుగా వచ్చిన గణపతిని చూసి మోహిస్తుంది.తనను వివాహం చేసుకోమని గణపతిని అడుగుతుంది.అందుకు వినాయకుడు ఒప్పుకోకపోవడంతో దీర్ఘకాలం బ్రహ్మచారిగానే ఉండిపొమ్మని గణపతిని శపిస్తుంది.
రాక్షసునికి జీవితాంతం బందిగా ఉండిపొమ్మని ప్రతిశాపంగా వినాయకుడు కూడా శపిస్తాడు.అయితే ఆ శాపాన్ని భరించలేనని తులసి వేడుకోగా విష్ణుమూర్తి వలన విమోచనం పొంది తులసీ వృక్షంగా అవతరిస్తావని అనుగ్రహిస్తాడు.
ఆ తర్వాత తులసి బ్రహ్మదేవుని వరంతో శంకరుడు( Sankara ) అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది.కృష్ణ కవచం ఉందనే గర్వంతో దేవతలందరినీ అతడు బాధిస్తూ ఉంటాడు.
తులసి దేవి పాతివ్రత్యాన్ని మహిమతో అతన్నీ ఎవరు జయించలేక పోతారు.

అలాగే వినాయకుని సహాయంతో ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లెల చేసి రాక్షసుడిని విష్ణువు సంహరిస్తాడు.తర్వాత శ్రీహరి వరంతో తులసి మొక్కగా అవతరిస్తుంది.తన పాతివ్రత్యానికి భంగం చేయడానికి సహకరించిన గణపతిని శిరస్సు లేకుండుగాక అని తులసి శపిస్తుంది.
తనను శపించిందన్న కోపంతో తులసి సన్నిహిత్యాన్ని సహింపనని గణపయ్య చెబుతాడు.వినాయక చవితి రోజు మాత్రం మినహాయింపు ఉందని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది.
అందుకే వినాయక చవితి రోజు మినహా మరే రోజు వినాయకుడికి తులసిని సమర్పించకూడదని పండితులు చెబుతున్నారు.