గురు పౌర్ణమి రోజున చేయాల్సిన చేయకూడని పనులు ఇవే..!

గురు పౌర్ణిమ( Guru Poornima ) రోజున గురువులను, పెద్దలను ఈ రోజున పూజిస్తారు.ఆది యోగి, ఆది గురువైన మహా శివుడు ఆషాడ పౌర్ణమి రోజు సప్త ఋషులకు జ్ఞాన బోధ చేశాడని శివపురాణం చెబుతున్నది.

 These Are The Things To Do And Not To Do On The Day Of Jupiter's Full Moon , Gur-TeluguStop.com

ఆషాడ పౌర్ణమి దత్తాత్రేయుడు ( Dattatreya )తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది.వ్యాస మహాముని ఈరోజున సత్యవతి పరాశరా మహర్షికి జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాన్ని బుగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదాలుగా విభజించాడని పండితులు చెబుతున్నారు.

ఈ పుణ్య విశేషమును పురస్కరించుకొని ఆషాడ పూర్ణమి రోజు గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ ను జరుపుకుంటారు.

Telugu Bhakti, Dattatreya, Devotional, Guru Poornima, Lakshminarayana-Latest New

గురు పూర్ణిమ రోజు చేయాల్సిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.గురు పూర్ణిమ రోజున లక్ష్మీనారాయణ( Lakshminarayana ) ఆలయంలో కొబ్బరికాయ కొట్టాలి.ఈ రోజున విష్ణువును పూజించి మీ శక్తి మేరకు దానం చేయాలి.

ఈరోజున పసుపు, మిఠాయిలు, దానం చేస్తే మంచిది.ఇలా చేయడం వల్ల జాతకం లో గరు దోషం దూరమవుతుంది మీకు డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే గురు పూర్ణిమ రోజు అవసరమైన వారికి శనగపప్పు దానం చేయాలి.

సాయంత్రం వేళలలో భార్యాభర్తలు కలిసి చంద్రుని దర్శనం చేసుకుని పూజిస్తే వారి దాంపత్య జీవితంలో ఆటంకలు దూరం అయిపోతాయి.

Telugu Bhakti, Dattatreya, Devotional, Guru Poornima, Lakshminarayana-Latest New

ఇంకా చెప్పాలంటే పౌర్ణమి సాయంత్రం తులసి మొక్క ముందు ఆవు నెయ్యి తో దీపం వెలిగించడం వల్ల అదృష్టం కలుగుతుంది.అలాగే గురు పౌర్ణమి రోజున చేయకుడనీ పనుల గురించి తెలుసుకుందాం.ఈ రోజునా ఇంటికి వచ్చిన బిచ్చగాళ్లను ఖాళీ చేతులతో వెనక్కి పంపకూడదు.

ఈ రోజునా పేదలకు లేదా అవసరం ఉన్నవారికి వస్తువులను దానం చేయడం ద్వారా రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు.గురు పౌర్ణమి రోజున పెద్ద వారిని అలాగే మహిళలను పొరపాటున కూడా అవమానించకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube