టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Prashant Varma )
తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఇండియన్ సూపర్ హీరో సినిమా ‘హను – మాన్’.ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ( Teja Sajja ) హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ లుగా నటించారు.
ఈ సినిమా స్టార్టింగ్ లో పెద్దగా అంచనాలు ఏవీ లేవు.కానీ ఆ తర్వాత మాత్రం అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ రిలీజ్( Hanuman Teaser ) తో అంచనాలు భారీగా పెంచుకోగా పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.అందుకే గ్రాఫిక్స్ విషయంలో ఏ చిన్న మిస్టేక్ లేకుండా ఉండాలని వాయిదా వేశారు.అయితే రెండు మూడు వారాలు లేదంటే ఒక నెల వాయిదా వేస్తారేమో అనుకున్నారు.కానీ ఈయన ఏకంగా 6 నెలల వాయిదా వేసి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
నిన్న ఈ విషయం అఫిషియల్ గా రాగానే అందరూ షాక్ అయ్యారు.ఎందుకంటే 6 నెలలు వదిలిపెట్టి టఫ్ ఫైట్ ఉండే సంక్రాంతి సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు.
దీంతో ఈయన చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడేమో అనే సందేహం అందరిలో వచ్చింది.దీనికి కారణం కూడా లేకపోలేదు.
ప్రభాస్ ప్రాజెక్ట్ కే( Project K ) జనవరి 12న అని ఎప్పుడో ప్రకటించారు.
అలాగే మహేష్ గుంటూరు కారం సినిమాతో పాటు చిరంజీవి మూవీ, రవితేజ ఈగల్ మూవీలు రిలీజ్ అవుతున్నాయి.
ఈ నాలుగు సినిమాల మధ్య హను మాన్ రిలీజ్ చేయడం ఖచ్చితంగా రిస్క్ అని అంటున్నారు.అయితే ప్రశాంత్ వర్మ ఆలోచన ఏంటంటే.
రిలీజ్ డేట్ ప్రకటించి పెట్టుకుంటే అప్పటికి ఈ సినిమాలన్నీ ఏవి రిలీజ్ అవుతాయో ఏవి వాయిదా వేస్తారో చూసుకుని హనుమాన్ రిలీజ్( Hanuman Release Date ) చేయాలా వద్దా అని ఆలోచించవచ్చు అని అందుకే ఇలా చేసారని టాక్ వినిపిస్తుంది.అందులోను ప్రాజెక్ట్ కే వాయిదా పడొచ్చు అనే టాక్ కూడా ఉంది.అందుకే ఈయన రిస్క్ తీసుకున్నాడు అని టాక్.మరి అప్పటికి రిలీజ్ చేస్తాడో లేదో వేచి చూడాలి.