నవమి రోజున సీతారాములకు వడపప్పు పానకాన్ని..నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే జగదాభిరాముడు పుట్టినరోజు శ్రీరామనవమిగా ( Sri Rama Navami ) జరుపుకుంటారు.ఈ పవిత్రమైన రోజున రామ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సీతారాముల కల్యాణాన్ని తిలకించి శ్రీరామచంద్రమూర్తిని పూజిస్తారు.

 Significance Of Vadapappu Panakam On Sri Rama Navami Details, Jagadabhiramudu ,s-TeluguStop.com

ఈ సందర్భంగా శ్రీరాముడికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి పూజిస్తూ ఉంటారు.అయితే నైవేద్యంగా ఈ రోజున పానకం, వడపప్పును శ్రీ రామునికి ప్రత్యేకంగా తయారు చేస్తారు.

అసలు వీటిని నైవేద్యంగా ఎందుకు పెడతారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.శ్రీరామచంద్రునికి బెల్లం( Jaggery ) అంటే ఎంతో ఇష్టమని పండితులు చెబుతున్నారు.

Telugu Jagadabhiramudu, Lakshmana, Ramayanam, Sita, Sri Rama Navami, Sri Ramudu,

ఆధ్యాత్మిక సనాతన ధర్మం ప్రకారం రామాయణంలో రాముడు వనవాసం చేస్తున్న సమయంలో శ్రీరాముడు( Sri Ramudu ), సీత( Sita ), లక్ష్మణులు ( Lakshmana )తమ ఆహారంగా కొన్ని పండ్లు, గింజలు, మూలికలతో పానకం తయారు చేసుకునే వారని పురాణాలలో ఉంది.అలాగే ఋషులు ఆయనకు వడపప్పు నైవేద్యంగా సమర్పించేవారని పురాణ కథలు ఉన్నాయి.శ్రీరామనవమి రోజు భక్తులు పానకం, వడపప్పును తయారుచేసి ఈ స్వామివారికి నైవేద్యంగా పెట్టి తర్వాత ప్రసాదంగా స్వీకరించడం ఒక సాంప్రదాయంగా వస్తోంది.అంతే కాకుండా ఇంట్లో అందరూ పానకం, వడపప్పు పంచుకోవడం ద్వారా సామాజిక సమరసత సహకారాన్ని పెంపొందించుకోవడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశాలలో ఒకటి.

Telugu Jagadabhiramudu, Lakshmana, Ramayanam, Sita, Sri Rama Navami, Sri Ramudu,

అలాగే ఎండాకాలంలో వచ్చే శ్రీరామనవమి రోజున పానకం సేవించడం వల్ల శరీరానికి చలువ కూడా చేస్తుంది.పాలకుల్లో ఉండే ఔషధ గుణాలు జీర్ణ క్రియ కు ఎంతగానో ఉపయోగపడతాయి.అలాగే ఇందులో వడపప్పులో ఉపయోగించే పప్పు ధాన్యాలు మంచి ప్రోటీన్, పీచు పదార్థాలకు మూలం.వడపప్పు తినడం వల్ల శరీరానికి ఎంతో శక్తి లభిస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు.

కాబట్టి మన శ్రీ రాముడికి పెట్టే ఈ నైవేద్యం ఆరోగ్య పరంగా కూడా ప్రతి ఒక్కరికీ మంచి చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube