ఈ రోజుల్లో మారిన జీవనశైలి,విద్య, ఉద్యోగం, వ్యాపారం, సాధించాలనే తపన వంటి కారణాలతో విపరీతమైన ఒత్తిడికి గురి అవుతున్నారు.జీవితంలో పరుగెడుతూ పనులను చేస్తూ మానసికంగా బాగా అలసిపోతున్నారు.
ఆ మానసిక ఒత్తిడి చివరకు డిప్రెషన్ కి దారి తీస్తుంది.ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఒత్తిడిని తగ్గించుకొనే మార్గాలను ఫాలో అవ్వాలి.
ఇప్పుడు ఒత్తిడి తగ్గటానికి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి… ఏమి చేయాలో వివరంగా తెలుసుకుందాం.
ఒత్తిడి తగ్గాలంటే ఒంటరిగా లేకుండా నలుగురిలో ఉంటూ సరదాగా గడపాలి.అలాగే ఇష్టమైన ప్రదేశాలకు ఇష్టమైన వారితో వెళ్లి ఆనందంగా గడపాలి.ఈ విధంగా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.
బిజీ జీవితంలో నుంచి కాస్త బయటకు వచ్చి వినోదాన్ని ఎంజాయ్ చేయటం అలవాటు చేసుకోవాలి.అప్పుడు మైండ్ రీ ఫ్రెష్ అవుతుంది.
ఒత్తిడి అనిపించినప్పుడు పజిల్స్ నింపడం, పదవినోదం, మెదడుకు మేత వంటి వాటిని సాల్వ్ చేస్తూ ఉంటే ఒత్తిడి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది.
పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, యోగా,ఇష్టమైన ఆటలను ఆడటం,స్విమ్మింగ్ చేయటం వంటివి చేసిన ఒత్తిడి తగ్గుతుంది.
వీటిని చేయటానికి ప్రతి రోజు కొంత సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
పాలు, బాదం పప్పు, నారింజ పండ్లు, పాలకూర, చేపలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
వీటిలో ఉండే పోషకాలు ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.