జుట్టు ఒత్తుగా, నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తూ కనిపిస్తే ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అటువంటి జుట్టు కోసం ఆరాట పడనివారు ఉండరు.
కానీ ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కాలుష్యం, మద్యపానం, ధూమపానం, ఒత్తిడి, బిజీ లైఫ్ స్టైల్ తదితర కారణాల వల్ల అటువంటి జుట్టును పొందడం చాలా మందికి అసాధ్యంగా మారుతుంటుంది.కానీ సాధ్యమే.
ఇప్పుడు చెప్పబోయే రెమెడీని నెలలో కేవలం రెండు సార్లు కనుక పాటిస్తే మీ జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక అలోవెరా ఆకు( Aloe vera )ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అలోవెరా ముక్కలు వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఉడికించిన రైస్, మూడు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ), రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( Coconut Oil ) రెండు రెబ్బలు కరివేపాకు, రెండు తుంచిన మందార ఆకులు వేసి కొద్దిగా వాటర్ పోసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.నెలలో కేవలం రెండంటే రెండు సార్లు ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే కనుక జుట్టుకు చక్కటి పోషణ లభిస్తుంది.

హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.తెల్ల జుట్టు సమస్య త్వరగా దరిచేరకుండా ఉంటుంది.కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి.కాబట్టి ఒత్తయిన, నల్లటి జుట్టును పొందాలని కోరుకునేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.చుండ్రు సమస్యను నివారించడానికి కూడా ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.