ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కంటికి కనిపించని అతిసూక్ష్మజీవి కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే.ఈ ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేసే సరైన వ్యాక్సిన్ ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు.
దీంతో కరోనా వైరస్ సోకకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.ముఖ్యంగా కరోనా వైరస్ నుంచి రక్షించుకోవాలంటే.
రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని.అందుకు పోషకాహారం తీసుకోవాలని నిపుణులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.
అయితే చింత చిగురు తీసుకోవడం వల్ల కూడా శరీర రోగ నిరోధక వ్యావస్థ బలపడుతుంది.ఎందుకంటే.చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.అందుకు కనీసం రెండు రోజులకు ఒకసారి అయినా చింత చిగురు తీసుకుంటే.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇక చింత చిగురుతో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు చింత చిగురు తీసుకుంటే చాలా మంచిది.ఎందుకంటే.చింత చిగురులో బోలెడన్ని ఔషధ గుణాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయి.రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు.
ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అవసరమైన పోషకాలను అందించడంలోనూ చింత చిగురు సహాయపడుతుంది.ఇక నేటి కాలంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.
అయితే అలాంటి వారికి చింత చిగురు ఔషధంలా పని చేస్తుంది.అందుకే చింత చిగురు డైట్‌లో చేర్చుకుంటే.థైరాయిడ్ సమస్య నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ.
క్యాన్సర్ వంటి భయంకర సమస్యల నుంచి రక్షించడంలోనూ చింత చిగురు గ్రేట్‌గా సహాయపడుతుంది.మరియు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి.
మధుమేహాన్ని అదుపులో ఉంచగలిగే శక్తి కూడా చింత చిగురుకు ఉంది.సో.ఈ సీజన్‌లో విరివిరిగా దొరికే చింత చిగురు తినడం అస్సలు మరవకండి.