ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ మొబైల్స్ చూస్తూనే ఉన్నాము.ఇప్పుడు స్మార్ట్ మొబైల్ల వాడకం అనేది సర్వసాధారణం అయిపోయింది.
చేతిలో స్మార్ట్ మొబైల్ ఉంటే కచ్చితంగా బ్లూ టూత్ కానీ, ఇయర్ బడ్స్ కానీ వినియోగిస్తూ ఉంటారు.బ్లూ టూత్, ఇయర్ బడ్స్ వాడకం రోజు రోజుకి ఎక్కువ అవ్వడంతో, డిమాండ్ కి అనుగుణంగా మార్కెట్లోకి రకరకాల కొత్త ఇయర్ బడ్ లు ఎయిర్ పాడ్లు, వైర్లెస్ నెక్ బ్యాండ్లు అందుబాటులోకి వస్తున్నాయి.
చిన్న బ్లూటూత్ లు, ఇయర్ బడ్స్ ఉపయోగించడం వల్ల సులభంగా క్యారి చేసే వీలుగా ఉంటుంది.దీంతో వైర్లెస్ వాడకంతో అవి విడుదల చేసే రేడియేషన్ వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు.
అసలు బ్లూటూత్, ఇయర్ బడ్స్ అనేవి రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ద్వారా ఫోన్లకు, ఇతర పరికరాలకు కనెక్ట్ అవుతుంది.దీంతో బ్లూటూత్, హెడ్ ఫోన్లలో కేబుల్స్ గాని, వైర్లు గాని ఉండవు.
దీని వల్ల మనం వ్యాయామం చేసేటప్పుడు గాని, ఇతర ఏ పనులైన చేసేటప్పుడు గాని పాటలు వినడానికి లేదా ఫోన్లో మాట్లాడేందుకు వీలుగా ఉంటాయి.అయితే బ్లూటూత్, ఇయర్ బడ్స్ నుండి వెలువడే విద్యుదయస్కాంతం ఫ్రీక్వెన్సీ మానవుని శరీరానికి చాలా హానికరం.
యూఎస్ లోని కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు వీటి పై పరిశోధన చేశారు.అందులో బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ జెర్రీ ఫిలిప్స్ ఏం చెప్పారంటే బ్లూటూత్ లేదా వైర్లెస్ హెడ్ ఫోన్లు వాడడం వల్ల మెదడు కాన్సర్ని పెంచే ప్రమాదం ఉందన్నారు.ఇయర్ బడ్స్ నుండి వెలువడే తరంగాలు మెదడు కనజాలాన్ని దెబ్బ తీయడమే కాకుండా న్యూరో లాజికల్, జన్యు పరమైన రుగ్మతలు వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం అవుతుందన్నారు.దీంతో పాటు వీటిని అధికంగా వినియోగిస్తే జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది.
పిల్లలు, గర్భిణీలు వీటి వల్ల ఎక్కువగా ప్రమాదంలో పడుతున్నారని తెలిపారు.