ఆస్ట్రేలియా బౌలర్లకు తాట తీసిన జైస్వాల్.. దిగ్గజాల సరసన చోటు

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 -25 లో( Border-Gavaskar Trophy ) భాగంగా పెర్త్ వేదికగా ఆక్టోపస్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ నేడు మూడో రోజు కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో రెండో రోజు ఆడమూసే సమయానికి 90 పరుగుల వద్ద నాట్ అవుట్ గా ఉండగా.

 Yashasvi Jaiswal Smashes Maiden Test Century In Australia In Debut Game Details,-TeluguStop.com

నేడు మొదటి సెషన్ లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు జైస్వాల్.( Jaiswal ) 205 బంతుల్లో ఎనిమిది బౌండరీలు మూడు సిక్సులతో బౌలింగ్ అప్పర్ కట్ షార్ట్ తో సిక్సర్ బాది తన కెరీర్ లో నాలుగో సెంచరీని( Fourth Century ) నమోదు చేశాడు.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా బౌలర్లను ముచ్చెమటలు పట్టించాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఇప్పుడు దూకుడుగా ఆడే జైస్వాల్ ఎంతో ఓపికగా ఆస్ట్రేలియా( Australia ) బౌలర్లను ఎదుర్కొంటూ ఒక్కొక్క పరుగు జత చేసి చివరికి మూడు అంకెల స్కోర్ను చేరుకున్నాడు.

Telugu Australia, Gavaskar Trophy, Ind Aus, India, Ravi Shastri, Yashasvijaiswal

ఈ నేపథ్యంలో జైస్వాల్ అరుదైన రికార్డులను కొల్లగొట్టాడు.23 ఏళ్ల కంటే తక్కువ వయసులో టీమిండియా( Team India ) తరఫున క్యాలెండర్లో అత్యధికంగా టెస్ట్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ నిలిచాడు.ఈ జాబితాలో రవి శాస్త్రి, సచిన్ టెండూల్కర్ దిగ్గజాల సరసన జైస్వాల్ సంయుక్తంగా నిలిచాడు.1984లో రవిశాస్త్రి, 1992లో సచిన్ టెండూల్కర్.ఇప్పుడు జైస్వాల్ ఓకే క్యాలెండర్లో మూడేసి శతకాలు సాధించారు.ఈ లిస్టులో 1971లో భాస్కర్ 1993లో వినోద్ కాంబ్లీలు నాలుగు శతకాలతో మొదటి స్థానంలో ఉన్నారు.

Telugu Australia, Gavaskar Trophy, Ind Aus, India, Ravi Shastri, Yashasvijaiswal

మరోవైపు 23 ఏళ్ల వయసులోపు టీమిడియా తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన మూడో ప్లేయర్ గా జైస్వాల్ రికార్డు నెలకొల్పాడు.ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్ 8 సెంచరీలు, అలాగే రవి శాస్త్రి ఐదు సెంచరీలతో ముందున్నారు.ఇకపోతే ఆస్ట్రేలియలో 2014 – 15 తర్వాత అంటే దాదాపు దశాబ్ద కాలం తర్వాత సెంచరీ సాధించిన మొదటి ప్లేయర్ గా జైస్వాల్ రికార్డులలోకి ఎక్కాడు.ఇదివరకు చివరిగా సిడ్నీ టెస్టులో కేఎల్ రాహుల్ శతకం చేశాడు.

ఆ తర్వాత ఇప్పుడే జైశ్వాల్ సెంచరీ చేశాడు.ఇక 297 బంతులలో 15 ఫోర్లు, మూడు సిక్సర్లతో 161 పరుగులు చేసి మిచెల్ మార్ష్ బౌలింగ్లో స్మితుకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.

ప్రస్తుతం టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకు వెళ్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube