అంతుచిక్కని విగ్రహ రహస్యం.. వేంకటేశ్వరస్వామి అభిషేకం ఓ వింత.. ఎక్కడంటే?

ప్రపంచంలో ఎన్నో మతాలకు సంబంధించిన విశ్వాసాలు కొనసాగుతూనే ఉంటాయి అలాగే భారతదేశంలో కూడా విభిన్న మత సంస్కారాలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి.ఇకపోతే భారతదేశం లాంటి దేశంలో హిందూ సాంప్రదాయాలు ఎక్కువగా కొనసాగుతూ ఉంటాయి.

 The Mystery Of The Elusive Statue Venkateswara Swamy Abhishekam Is A Strange Pla-TeluguStop.com

ఈ నేపథ్యంలో హిందూ సాంప్రదాయంలో భాగంగా దేవాలయాలలో స్వామివారికి నిత్యం అభిషేకం చేస్తూ ఉంటారు.ఇలా స్వామివారికి నీళ్లు, పాలు, పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు.

ఇది ఎక్కడైనా జరిగే అభిషేక ప్రక్రియనే.అయితే కర్ణాటకలోని గబ్బూరులో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వింత దృశ్యం కనబడుతుంది.

ఎక్కడైనా సరే స్వామి వారికి అభిషేకం చేసే సమయంలో మామూలు నీటితో అభిషేకం చేయడం మన గమనిస్తాము.అయితే ఇక్కడ మాత్రం సెగలు కక్కే నీటితో అభిషేకం చేస్తుంటారు.

ఇలా బాగా వేడిగా ఉన్న నీటిని స్వామివారి విగ్రహంపై పోయగా అవి వెంటనే స్వామి వారి పాదాల వద్దకు చేరేసరికి చాలా చల్లగా మారిపోతాయి.రెప్పపాటులో జరిగే ఈ సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రతి ఆదివారం భక్తులు గుడికి భారీ ఎత్తున చేరుకుంటుంటారు.

హరిహర క్షేత్రంగా పిలుచుకునే ఈ గుడికి వందల ఏళ్ల చరిత్ర ఉంది.నిజానికి పరమేశ్వరుడు అభిషేక ప్రియుడని, వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడని తెలిసిన విషయం.

అయితే ఈ హరిహర గుడిలో వెంకటేశ్వర స్వామి అలాగే శివయ్య ఇద్దరూ కొలువ తీరడం అక్కడ ఉన్న ప్రత్యేకత.ఇక ఆలయాన్ని 12వ శతాబ్దానికి చెందిన సేవన వంశరాజు లింగాన్ని ఏర్పాటు చేసేందుకు గర్భగుడిలో ఓ పీఠాన్ని కూడా ఏర్పాటు చేశారు.

కానీ తనకు ఆలయంలో చోటు కావాలన్నాడట శ్రీహరి అని అప్పట్లో రాజు తెలిపారుట.దాంతో విష్ణు మాట మేరకు శివుడు తనకోసం ఏర్పాటు చేసిన పీఠంపై వెంకటేశ్వరుడి విగ్రహం ప్రతిష్టించేలా ఏర్పాట్లు చేశారట.

ఆ తర్వాత కాలక్రమమైన అగస్త ముని ఆ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థల పురాణం చెబుతుంది.

ఇది ఇలా ఉండగా.

స్వామి వాళ్లకు నిత్యం చేసే పూజలు వేరు.ఆదివారం రోజు వెంకటేశ్వర స్వామి జరిగే అభిషేకం మరో వ్యక్తి ఎందుకంటే ఆరోజు విగ్రహానికి వేడివేడి నీటితో అభిషేకం నిర్వహిస్తారు.

కానీ ఆ సమయంలో వేడి నీరు స్వామి వారి తల పైన పోయగా కిందికి చేరుకోగానే చాలా చల్లగా మారిపోతుంది.ఒకవేళ అదే నీరు స్వామి వారి నాభి స్థానంలో పోస్తే వేడిగా ఉంటుందని అక్కడే స్వామీజీలు తెలుపుతున్నారు.

ఈ అభిషేకం కేవలం ఆదివారం మాత్రమే నిర్వహిస్తారు.ఈ సమయంలో ఎంతోమంది భక్తులు ఈ వింతను చూసేందుకు ఆ గుడికి పెద్ద ఎత్తున తరలివస్తారు.

ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి, శివరాత్రి, శ్రీరామనవమి ఇలా అనేక పండుగులను చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube