కెనడా : భారత సంతతి యువతి మరణంపై ముగిసిన దర్యాప్తు.. ఏం తేల్చారంటే?

గత నెలలో కెనడాలోని హాలిఫాక్స్‌లో( Halifax, Canada ) ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో వాక్ ఇన్ ఓవెన్‌లో ప్రాణాలు కోల్పోయిన భారత సంతతికి చెందిన గుర్‌సిమ్రన్ కౌర్ ( Gursimran Kaur )(19) కేసు దర్యాప్తును అక్కడి పోలీసులు ముగించారు.బ్రూట్ ఇండియా కథనం ప్రకారం.

 No Foul Play In Indian Origin Teenager’s Death At Walk-in Oven In Canada Repo-TeluguStop.com

హాలిఫాక్స్ పోలీసులు ఆమె మరణం అనుమానాస్పదంగా లేదని , దీని వెనుక కుట్ర కోణం కానీ, హింసాత్మక చర్యలు జరిగాయి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపినట్లుగా నివేదించింది.

గురుసిమ్రన్ తన తల్లితో కలిసి కెనడాలోని హాలిఫాక్స్ ప్రాంతంలో ఉన్న వాల్ మార్ట్ స్టోర్‌లో పనిచేసేది.

అక్టోబర్ 19న ఆమె స్టోర్‌లోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.కూతురిని నిర్జీవంగా చూసిన ఆమె తల్లి వెంటనే సాయం కోసం అర్ధించింది.దురదృష్టవశాత్తూ బేకరీ వాక్ ఇన్ ఓవెన్‌‌లో బాధితురాలు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.అయితే గురుసిమ్రత్ మరణానికి దారితీసిన కారణాలపై స్థానిక పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు నిర్వహించారు .గురుసిమ్రత్ ఆమె తల్లి మూడేళ్ల క్రితం భారత్ నుంచి కెనడాకు వలస వచ్చారు.అనంతరం దాదాపు రెండేళ్లుగా వాల్‌మార్ట్ స్టోర్‌లో పనిచేస్తున్నారు.

Telugu Balbir Singh, Brute India, Canada, Citizens Canada, Gursimran Kaur, Halif

వాల్‌మార్ట్ ప్రతినిధి ఒకరు కొద్దిరోజుల క్రితం కెనడియన్ మీడియాతో మాట్లాడుతూ.గురుసిమ్రత్ కేసు నేపథ్యంలో విచారణకు పూర్తి సహకారం అందిస్తామన్నారు.దీనిలో భాగంగా స్టోర్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లుగా ఆయన తెలిపారు.బాధితురాలి తల్లితో పరిచయం ఉన్న మారిటైమ్ సిక్కు సొసైటీకి చెందిన బల్బీర్ సింగ్( Balbir Singh ) మాట్లాడుతూ.

బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు.

Telugu Balbir Singh, Brute India, Canada, Citizens Canada, Gursimran Kaur, Halif

గురుసిమ్రన్ కౌర్‌కు అక్కడి భారతీయ సమాజం, కెనడా పౌరులు( Indian community, citizens of Canada ) అండగా నిలిచారు.ఆమె కుటుంబానికి బాసటగా నిలిచేందుకు ఆన్‌లైన్‌లో GoFundMe ద్వారా నిధుల సేకరణ కార్యక్రమం నిర్వహించగా ఏకంగా రూ.కోటికి పైగా అందినట్లుగా తెలుస్తోంది.మారిటైమ్ సిక్కు సొసైటీ ఈ నిధుల సేకరణ కార్యక్రమం నిర్వహించింది.50 వేల కెనడా డాలర్లు (భారత కరెన్సీలో రూ.60.78 లక్షలు) టార్గెట్‌తో ప్రారంభించిన ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం కొద్దిగంటల్లోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని రెట్టింపు మొత్తం అందుకున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube