ఈ ప్రపంచంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి.ఇలాంటి దేవాలయాలను దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు.
అదే విధంగా కొన్ని దేవాలయాల్లో ఎన్నో వింతలకు రహస్యాలకు నిలయంగా ఉన్నాయి.అలాంటి దేవాలయాలపై ఎన్నోసార్లు ఎంతో మంది పరిశోధకులు వాటిని కనుగొనే ప్రయత్నం చేసినప్పటికీ అవి అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయాయి.
ఇలాంటి రహస్యంగా మిగిలిన దేవాలయాలలో రాజస్థాన్ లోని కిరుడు దేవాలయం కూడా ఒకటి.
ఈ ఆలయం రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో కలదు.
ఈ ఆలయంలోకి సూర్యాస్తమయం తరువాత భక్తులెవరు ప్రవేశించరు, అక్కడ నిద్ర చేయరు.ఒకవేళ సూర్యాస్తమయం తర్వాత వెళ్ళిన భక్తులు ఆలయం నుంచి బయటకు రాకుండా ఆలయంలోనే రాయిగా మారిపోతారు.
ఈ విధంగా ఈ ఆలయంలో భక్తులు రాయిగా ఎందుకు మారుతారు అనే విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పూర్వ కథనం ప్రకారం ఒక సాధువు తన శిష్యులను తీసుకొని ఈ దేవాలయానికి వచ్చాడు.ఆ సాధువు తన శిష్యులను దేవాలయంలో వదిలి బయటకు వెళ్లి చుట్టూ ఉన్న ప్రాంతాలను చూడసాగాడు.ఆ సాధువు అటు నుంచి అటే రాజ్యంలోని మరికొన్ని ప్రదేశాలను చూడటానికి వెళ్ళాడు.
అసలు తన శిష్యులను ఆలయంలో ఉంచిన సంగతి మర్చిపోయిన సాధువుకు కొన్ని రోజుల తర్వాత శిష్యులు గుర్తుకు రావడంతో తిరిగి ఆలయం చేరుకున్నాడు.

ఆలయం లోపల ఉన్న శిష్యులకు ఆ గ్రామ ప్రజలు ఎవరూ కూడా పిడికెడు అన్నం పెట్టలేదు వారికి సహాయం చేయలేదు వారిపట్ల ఎంతో కఠినంగా ప్రవర్తించడం వల్ల శిష్యులు ఎంతో నీరసించిపోయారు.ఈ విషయం గురించి ఎంతో ఆగ్రహించిన సాధువు రాయి లాంటి మనసు కలిగిన స్థానికులను రాళ్లుగా మారి పొమ్మని చెప్పించాడు.అయితే ఆ ఊరిలో ఓ మహిళ వారికి సహాయం చేయడం వల్ల ఆమె మనిషి గా ఉంటుంది.
కానీ ఆ మహిళను సాధువు సహాయం చేసిన నువ్వు వెనక్కు తిరగకుండా ఇక్కడినుంచి వెళ్లాలని చెబుతాడు.కానీ ఆ మహిళ వెనక్కి తిరిగి చూడటం వల్ల రాయిగా మారుతుంది.
అప్పటి నుంచి ఆ గ్రామంలోని ప్రజలు ఎవరూ కూడా సూర్యాస్తమయం తరువాత ఆలయంలోనికి ప్రవేశించరు.క్రీ.శ.12 వ శతాబ్దంలో కిరడు రాజ్యాన్ని సోమేశ్వర్ అనే రాజు పరిపాలించేవాడు.అయన కాలంలోనే ఈ దేవాలయాలన్నీ తురుష్కుల దాడిలో ధ్వంసం అయ్యాయి.