రెండు నెలలలో లోక్ సభ రద్దు అంటున్న.. ఏపీ కాంగ్రెస్ నేత చింత మోహన్..!!

దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు( Early Elections ) రాబోతున్నాయని జాతీయ పార్టీలకు చెందిన కీలక నాయకులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు చెప్పుకొస్తున్నారు.

 Ap Congress Leader Chinta Mohan Wants Lok Sabha Dissolved In Two Months Details,-TeluguStop.com

ఇదే సమయంలో జాతీయస్థాయిలో విపక్షంలో ఉన్న ప్రధాన పార్టీలు “ఇండియా”( INDIA ) అనే కూటమిగా ఏర్పడటం తెలిసిందే.మూడోసారి కూడా అధికారంలోకి రావడానికి బీజేపీ పక్క వ్యూహాలతో ఉంది.

అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ( Congress Party ) కర్ణాటకలో గెలవడంతో.బీజేపీ ఘోరంగా ఓటమి చెందడంతో దేశంలో విపక్ష పార్టీలో గెలిచే అవకాశాలు ఉన్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి.

పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర మాజీ మంత్రి ఏపీ కాంగ్రెస్ నేత చింతా మోహన్( Chinta Mohan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.రెండో నెలలో లోక్ సభ( Lok Sabha ) రద్దు ఖాయమని వ్యాఖ్యానించారు.

నవంబర్ లేదా డిసెంబర్ లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.త్వరలోనే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని జోస్యం చెప్పారు.ఆ దిశగా కేంద్రం అడుగులు వేయబోతున్నట్లు పేర్కొన్నారు.ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీజేపీ పై ప్రజలు వ్యతిరేక భావనతో ఉన్నారని స్పష్టం చేశారు.

అందుకే ఎక్కడో తేడా కొట్టే అవకాశం ఉందన్న ఆందోళనలో ఎన్డీఏ ఉందని తెలిపారు.ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం నవంబర్ లేదా డిసెంబర్ లో లోక్ సభను రద్దుచేసి ఎన్నికలకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చింతా మోహన్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube