శీతాకాలంలో చలి నుంచి వరి నారుమడిని సంరక్షించే పద్ధతులు..!

శీతాకాలంలో వరి నారుమడి పెంపకం9( Rice Cultivation ) చేస్తే ప్రత్యేక శ్రద్ధ అవసరం.రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్న సమయంలో చలి తీవ్రతను తట్టుకోలేక నారు ఎర్రబడడం, కొన్నిసార్లు చనిపోవడం జరుగుతుంది.

 Methods Of Preserving Rice Paddy From Cold In Winter , Agriculture , Rice Cult-TeluguStop.com

కాబట్టి నారు పెంపకంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి.నారు పెంచే ప్రదేశంలో రసాయన ఎరువులతో పాటు నత్రజని, పోటాష్ ఎరువులను,( Potash fertilizers ) రెండు క్వింటాళ్ల గొర్రెల లేదా కోళ్ల ఎరువులు వేసి ఆ ప్రదేశం లో కలియ దున్నుకోవాలి.

అవసరం అయినంత మేర భాస్వరం ను దుక్కిలో వేయాలి.

Telugu Agriculture, Urea-Latest News - Telugu

శీతాకాలంలో చలి నుంచి నారు సంరక్షించబడాలంటే.నారుమళ్లపైన ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతం ఇచ్చి నారుపై పలుచని పాలిథిన్ షీట్ ను సాయంత్రం వేళల్లో కప్పి ఉంచి, ఉదయం తీసి వేయాలి.రాత్రి వేళల్లో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున ఆ నీరంతా తీసివేసి క్రొత్తనీరు పెట్టాలి.

నారు ఆరోగ్యంగా పెరగాలంటే పై పాటుగా యూరియా వేసినప్పుడు ఒక కిలో యూరియా కి రెండు గ్రాముల కార్బండిజం+ మాంకోజెబ్ మిశ్రమ మందును కలిపి వేసుకోవాలి. జింక్ లోపం ఏదైనా ఉంటే లోపాన్ని సవరించాలి.

Telugu Agriculture, Urea-Latest News - Telugu

దీర్ఘకాలిక రకాలకు చదరపు మీటరుకు 39 కుదుళ్ళు, మధ్యకాలిక రకాలకు 44 కుదుళ్ళు, స్వల్ప కాలిక రకాలకు 66 కుదుళ్ళు ఉండేటట్లు చూసుకోవాలి.శీతాకాలంలో స్వల్పకాలిక రకాలకు 66 కుదుళ్లతో అధిక దిగుబడి సాధించవచ్చు.నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 30 సెంటీమీటర్లు బాటలు తీయడం వలన పైరుకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలి చీడపీడల( Pests ) ఉధృతి కొంతమేరకు తక్కువగా ఉంటుంది.పశువుల ఎరువు, కంపోస్ట్, కోళ్ల ఎరువులు లాంటి సేంద్రియ ఎరువులకు( Organic fertilizers ) అధిక ప్రాధాన్యం ఇచ్చి రసాయన ఎరువులకు తక్కువ ప్రాధాన్యం ఇస్తే భూసారాన్ని కాపాడుకోవచ్చు.

రసాయన మరియు సేంద్రియ ఎరువులను కలిపి ఉపయోగిస్తే దాదాపుగా 25% వరకు నత్రజనిని ఆదా చేయవచ్చు.వరి పంట వేయడానికి ముందు పొలంలో జీలుగా లేదా జనుము లాంటి పచ్చి రొట్టె ఫైర్లు వేసి కలియ దున్నడం వల్ల భూసారం పెరిగి మంచి దిగుబడులు సాధించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube