బాలయ్య రెండు డిజాస్టర్ సినిమాలు.. నిర్మాతలకు మాత్రం లాభాలు?

సాధారణంగా సినిమాలు సూపర్ హిట్ అయినప్పుడు నిర్మాతలకు లాభాల పంట పండుతోంది అనే విషయం తెలిసిందే.కానీ సినిమా డిజాస్టర్గా నిలిచింది అంటే ఇక నిర్మాతలకు నష్టాలు తప్పవు.

 Balakrishna Big Disasters Gave Profits, Nandamuri Actor Simham Balayya, C. Kalya-TeluguStop.com

యావరేజ్ టాక్ సొంతం చేసుకుంటే పెట్టిన పెట్టుబడి వస్తుందేమో కానీ ప్లాప్ టాక్ వస్తే మాత్రం నిర్మాతలు ఎన్నో నష్టాలను చవి చూడాల్సిందే.కానీ కొంతమంది హీరోల సినిమాలు మాత్రం ఫ్లాప్ అయినా డిజస్టర్ అయినా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంటూ ఉంటాయి.

ఇక అటు నిర్మాతలకు మాత్రం లాభాలు వస్తూనే ఉంటాయి అని చెప్పాలి.అయితే ఇక నందమూరి నట సింహం బాలయ్య కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి.

సాదా సీదా నిర్మాతలకు సైతం ఎన్నో లాభాలు అందించిన సినిమాలు ఉన్నాయి.అయితే ఇలా హిట్ టాక్ వచ్చిన సినిమాలకు లాభాలు రావడం కామన్.కానీ బాలయ్య నటించిన రెండు సినిమాలు మాత్రం ఫ్లాప్ అయినా కూడా నిర్మాతలకు లాభాల పంట పండించాయట.బాలయ్య నటించిన పరమవీరచక్ర రూలర్ జైసింహ సినిమాలు సి.

కళ్యాణ్ బ్యానర్ లో వచ్చాయి.అయితే ఈ మూడు సినిమాల్లో జైసింహ మినహా మిగతా అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.నిర్మాతలకు మాత్రం లాభాలు తెచ్చి పెట్టాయి.2018 సంక్రాంతి సందర్భంగా విడుదలైన జై సింహా సినిమా 100 రోజులు ఆడింది.

Telugu Balakrishna, Balakrishnabig, Kalyan, Dasari, Jaisinha, Nandamurisimham, P

ఆ తర్వాత వచ్చిన పరమవీరచక్ర రూలర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్గా మిగిలిపోయింది.కానీ నిర్మాత కళ్యాణ్ కు మాత్రం నష్టాలు రాలేదట.ఈ రెండు సినిమాలు తాను చాలా తక్కువ ఖర్చుతో నిర్మించానని నటీనటులతో పాటు మేకింగ్ కాస్ట్ కూడా పెద్దగా లేదని అందుకే సినిమా డిజాస్టర్ అయినా తనకు నష్టాలు రాలేదు అని నిర్మాత సి.కళ్యాణ్ చెప్పారు. దాసరి అసలు దర్శకత్వంలో వచ్చిన పరమవీరచక్ర సమయంలో బాలయ్య దాసరి తో వర్క్ చేయాలనే ఆసక్తి తో రెమ్యూనరేషన్ కూడా పెద్దగా పట్టించుకోలేదని సి.కళ్యాణ్ తెలిపారు.ఇక రూలర్ సినిమా తక్కువ రేట్లకి అమ్మడంతో అటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఎలాంటి కష్టం రాలేదని కళ్యాన్ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube