1.రాహుల్ గాంధీని దేశం నుంచి వెళ్ళగొట్టాలి : ప్రజ్ఞ ఠాకూర్
బిజెపి ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ రాహుల్ గాంధీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.భారతదేశం గురించి విదేశీ గడ్డపై చులకనగా మాట్లాడడం సిగ్గుచేటుని ఆయనను వెంటనే దేశం నుంచి వెళ్ళగొట్టాలని ప్రజల ఠాకూర్ డిమాండ్ చేశారు.
2.తిరుమల సమాచారం
తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
3.వైసీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు : సజ్జల
ఏపీ అధికార పార్టీ వైసీపీ ఆవిర్భావ వేడుకలు తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) వైసీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదంటూ వ్యాఖ్యానించారు.
4.అమిత్ షాకు వ్యతిరేకంగా హైదరాబాదులో ఫ్లెక్సీలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాదులో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా భారీగా ఫ్లెక్సీలు వెలిసాయి.
5 నేడు కర్ణాటకలో ప్రధాని పర్యటన
భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) ఈరోజు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో అక్కడ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రధాని అక్కడకు వెళ్లారు.
6.అరెస్ట్ చేస్తే చేసుకోండి : వైఎస్ భాస్కర రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారుల విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా సిబిఐ అధికారులు అందుబాటులోకి లేకపోవడంతో భాస్కర్ రెడ్డి వెళ్లిపోయారు.ఈ సందర్భంగా తనను అరెస్టు చేస్తే చేసుకోండి అంటూ భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
7.ఏపీలో ఎన్నికల సామాగ్రి పంపిణీ
రేపు ఏపీలో 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.ఈ మేరకు ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేశారు.
8.ఈసీకి చంద్రబాబు లేఖ
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఓట్ల అక్రమాలపై సీఈసీకి టిడిపి చంద్రబాబు లేఖ రాశారు.
9.పౌల్ట్రీ , పందుల రవాణా పై నిషేధం
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఏవీఎన్ ఇన్ ఫ్లోయేంజా, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందుతూ ఉండడంతో అస్సాం ప్రభుత్వం అప్రమత్తమైంది.రాష్ట్రంలోకి పౌల్ట్రీ పందుల రవాణా పై నిషేధం విధించింది.
10.సిఐఎస్ఎఫ్ రేసింగ్ డే లో కేంద్ర హోం మంత్రి
హైదరాబాద్ లో 54వ సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే లో ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
11.నిజామాబాద్ జిల్లాలోకి రేవంత్ పాదయాత్ర
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర నేటి నుంచి నిజామాబాద్ లో జరగనుంది.
12.నేడు జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో సదస్సు
నేడు జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో రాజ్యాంగ వ్యవస్థలు పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నారు.దీనికి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ ముఖ్యఅతిథిగా ఉన్నారు.
13.500 మీటర్ల పొడవు వైసీపీ జెండాతో ర్యాలీ
గుంటూరులో నేడు వైసిపి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 500 మీటర్ల పొడవున్న వైసీపీ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.400 కేజీల భారీ కేక్ ను కట్ చేయనున్నారు.
14.ఎమ్మెల్సీ అభ్యర్థుల ఓపెన్ డిబేట్
విశాఖలో నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఓపెన్ డిబేట్ జరగనుంది దీనిని ఉత్తరాంధ్ర విద్యావంతులు వేదిక నిర్వహిస్తోంది.
15.బ్రహ్మోత్సవాలలో నేడు పల్లకి సేవ
కోడుమూరు మండలం శ్రీ గోరంట్ల లక్ష్మీ మాధవ స్వామి బ్రహ్మోత్సవాలలో నేడు పల్లకి సేవ నిర్వహించనున్నారు.
16.ఐరావతంపై దర్శనం ఇవ్వనున్న శ్రీవారు
కదిరిలోని శ్రీ కాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు తెల్లటి ఐరావతం పై శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు.
17.పందులకు అంతుచిక్కిన వ్యాధి
ఏపీలో పందులకు అంతు శక్తిని వ్యాధి సోకుతుంది.ఎన్టీఆర్ జిల్లాలో ఈ వ్యాధి కారణంగా దాదాపు 1,000 పందులు మరణించాయి.
18.ఏపీకి వర్ష సూచన
ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు
ఏపీలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
19.ఎద్దును ఢీ కొట్టిన వందే భారత్ రైలు
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందే భారత్ రైలు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులువంచ రైల్వే స్టేషన్ వద్దకు రాగానే ట్రాక్ పైకి వచ్చిన ఎద్దును రైలు ఢీ కొట్టింది.దీంతో రైలు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది.