2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్( FM Nirmala Sitharaman ) శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.వేతన జీవులకు భారీ ఊరట కలిగించేలా ఆమె తీసుకొచ్చిన పలు సంస్కరణలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.ఆదాయపు పన్ను శ్లాబులను( Income Tax Slabs ) సవరించడం, రూ.12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి రిబేట్ వంటి వాటిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
అయితే కేంద్ర బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రవాస భారతీయులకు( NRI’s ) మాత్రం నిర్మల నిర్ణయాలు షాకిచ్చాయి.ముఖ్యంగా విదేశాల్లోని విద్యార్ధులు, యువ నిపుణులకు మరింత కఠినమైన పన్ను విధానం అమల్లోకి రానుంది.
అంతర్జాతీయ పన్ను నిబంధనలతో ఎన్ఆర్ఐలకు పరిస్ధితి సంక్లిష్టంగా మారనుంది.

వర్క్ పర్మిట్లు, శాశ్వత నివాసం లేదా పౌరసత్వం ద్వారా విదేశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనుకునే భారతీయ విద్యార్ధులకు( Indian Students ) ఈ మార్పులు కొత్త సవాళ్లను కలిగిస్తాయి.ఆర్ధిక పారదర్శకతపై ప్రభుత్వం దృష్టి పెట్టడం ప్రపంచ ధోరణులకు అనుగుణంగా ఉంటుంది కానీ ద్వంద్వ ఆర్ధిక నిబద్ధతలతో యువ నిపుణులకు భారంగా మారుతుంది.పన్ను ఒప్పందాలు, సమ్మతి నియమాలలో సవరణల ద్వారా ఎన్ఆర్ఐలు విదేశాలలో సంపాదించే ఆదాయాన్ని కఠినంగా పర్యవేక్షించాలని బడ్జెట్ ప్రతిపాదిస్తోంది.

కేంద్రం ప్రతిపాదించిన ఆయా మార్పులు విద్యార్ధులను వెంటనే ప్రభావితం చేయకపోవచ్చు.కానీ కెనడా, ఆస్ట్రేలియాలలో శాశ్వత నివాసం లేదా అమెరికాలో హెచ్ 1 బీ స్పాన్సర్‌షిప్‌లను అభ్యసిస్తున్న విద్యార్ధులు వారి ట్యాక్స్ స్టేటస్‌ను రూపొందించడంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలో పోస్ట్ స్టడీ వర్క్ వీసాలపై( Post Study Work Visa ) ఉన్న విద్యార్ధులు, యువ వృత్తి నిపుణులు ఈ మార్పులు , ఆర్ధిక పరిస్ధితులను జాగ్రత్తగా పరిశీలించకపోతే పన్ను బాధ్యతలు పెరగడం, డబుల్ టాక్సేషన్ రిస్క్‌లకు దారి తీస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.