ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే ఆకుకూరల్లో కొత్తిమీర ముందు వరసలో ఉంటుంది.ప్రత్యేకమైన వాసన, రుచి కలిగే ఉండే కొత్తిమీరవెజ్ వంటలకైనా, నాన్ వెజ్ వంటలకైనా అద్భతమైన ఫ్లెవర్‌ను అందిస్తుంది.
పైగా విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, థయామిన్, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, కార్బొహైడ్రేట్స్ ఇలా బోలెడన్ని పోషకాలను కూడా కలిగి ఉంటుంది.అందుకే కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ కొందరు మాత్రం కొత్తిమీరను దూరం పెట్టాల్సిందే.ముఖ్యంగా లో బీపీ సమస్యతో బాధ పడే వారు.కొత్తిమీరను ఎంత తక్కవుగా తీసుకుంటే అంత మంచిది.ఎందుకంటే.
రక్త పోటు స్థాయిలను తగ్గించే గుణం కొత్తిమీరకు ఉంది.హై బీపీ ఉన్న వారికి ఇదే వారమే.
కానీ, లో బీపీ ఉన్న వారు కొత్తిమీర తీసుకుంటే.రక్త పోటు స్థాయిలు మరింత పడిపోయి ప్రాణాలే డేంజర్లో పడతాయి.
కాబట్టి, లో బీపీ బాధితులు కొత్తిమీరను చాలా లిమిట్‌గా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కొంత మందికి కొత్తిమీర అస్సలు పడదు.కొత్తిమీర తిన్నప్పుడల్లా కడుపు నొప్పి, అతిసారం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.అలాంటి వారు కూడా కొత్తిమీరను ఎవైడ్ చేయాలి.
అలాగే గర్భిణీలు కొత్తిమీరతో చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రెగ్నెన్సీ సమయంలో అధికంగా కొత్తిమీర తీసుకుంటే కడుపులోని పిండం ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
అందు వల్ల, ప్రెగ్నెన్సీ స్త్రీలు కొత్తిమీరను చాలా లైట్‌గా తీసుకోవాలి.
ఇక శరీరంలో వేడిని పుట్టించే తత్వం కడా కొత్తిమీరకు ఉంది.
కాబట్టి, కొత్తిమీరను అధికంగా తీసుకుంటే.శరీరంలో వేడి పెరిగి పోతుంది.
దాంతో తలనొప్పి, చికాకు, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.