ఇటీవల ట్రావెల్ వ్లాగర్ ఆకాష్ చౌదరి( Travel Vlogger Akash Chaudhary ) ఇండోనేషియాలోని జకార్తాలో( Jakarta ) ఓ షాకింగ్ దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు.రోడ్డు పక్కన ఉన్న ఓ దుకాణంలో నాగుపాములతో( Cobra Snakes ) రకరకాల వంటకాలు తయారుచేయడం చూసి ఆయన నోరెళ్లబెట్టారు.
ఈ వీడియోను ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.నాగుపామును వండటం, ప్రజలు దాన్ని ఆరగించడం చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.
భయానకమైన నాగుపామును ఆహారంగా తీసుకోవడమా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
విషపూరితమైన కోబ్రా స్నేక్స్‌ని చూస్తే సాధారణంగా అందరూ భయపడతారు.
కానీ ఇండోనేషియాలోని( Indonesia ) కొన్ని ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.అక్కడ నాగుపాములను ఆహారంగా తీసుకుంటారు.
అంతేకాదు, నాగుపాము మాంసం( Cobra Meat ) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని స్థానికులు గట్టిగా నమ్ముతారు.ఈ నమ్మకంతోనే వారు నాగుపాములను వండుకుని లాగించేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ అయిన ఆకాష్ (@kaash_chaudhary) ఈ వింత అనుభవాన్ని తన కెమెరాలో బంధించారు.ఓ విక్రేత బోనులోంచి లైవ్‌గా నాగుపామును తీసి దాన్ని పకోడీలు, నూడుల్స్, మోమోస్ లాంటి వెరైటీ వంటకాలుగా ఎలా మారుస్తున్నాడో కళ్లకు కట్టినట్టు చూపించారు.ఒక్కో కోబ్రా డిష్ ధర దాదాపు 2 లక్షల ఇండోనేషియన్ రూపియాస్ అంటే మన కరెన్సీలో సుమారు రూ.1,000. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
నాగుపాములతో వంటకాలు చేయడం చూసి షాక్ అయిన ఆకాష్ చౌదరి, వాటిపై ఫన్నీ కామెంట్ చేశారు.“నేను అక్కడికి వెళ్లి వాళ్లకి పప్పు అన్నం ఎలా వండాలో నేర్పిస్తాను!” అని సరదాగా అనడంతో, ఈ వీడియో మరింత వైరల్ అయింది.షాకింగ్ దృశ్యానికి ఆయన చేసిన ఈ కామెంట్ నెటిజన్లను కడుపుబ్బా నవ్వించింది.
ఈ వీడియోకి కేవలం కొన్ని రోజుల సమయంలోనే 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియో చూసిన కొందరు దీనివల్ల “కోబ్రా వైరస్” వస్తుందేమోనని జోకులు పేల్చారు.
మరికొందరు పాములను మామూలు స్నాక్స్ తిన్నంత ఈజీగా తినేస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఈ వింతైన, భిన్నమైన వంటకాల ట్రెండ్ ఆకాష్‌ను మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా యూజర్లను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఈ వీడియో చూసిన చాలా మంది ఇది ఆసక్తికరంగా, అదే సమయంలో కాస్త భయానకంగా కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు.