టాలెంట్ ఉన్నప్పుడు బలుపు ఉన్నా తప్పులేదు... బన్నీకి మద్దతు తెలిపిన నటి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) అరెస్ట్ గురించి పెద్ద ఎత్తున రాష్ట్ర రాజకీయాలలోనూ అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా చర్చలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే .అయితే ఇందులో అల్లు అర్జున్ తప్పులేదు అంటూ తాజాగా మరొక సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 Actress Sri Sudha Sensational Post On Allu Arjun Details, Allu Arjun, Sri Sudha,-TeluguStop.com

అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రాకముందే తొక్కిసలాట జరిగిందని ఈ తొక్కిసలాట జరిగిన దాదాపు 30 నిమిషాలకు అల్లు అర్జున్ సంధ్య థియేటర్( Sandhya Theatre ) వద్దకు వచ్చారు అంటూ మరొక వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Telugu Allu Arjun, Pushpa, Revanth Reddy, Sandhya Theatre, Sri Sudha, Srisudha,

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ ని ఇబ్బంది పెట్టారు అంటూ అభిమానులు తెలంగాణ సర్కారుపై రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా పూర్తిగా ఈ విషయాన్ని ఖండించారు కానీ రేవంత్ చాలా సీరియస్ గా తీసుకోవడంతో సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా సైలెంట్ అయ్యారు.

Telugu Allu Arjun, Pushpa, Revanth Reddy, Sandhya Theatre, Sri Sudha, Srisudha,

తాజాగా నటి శ్రీ సుధ( Sri Sudha ) అల్లు అర్జున్‌కు అండగా నిలిచింది.ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టింది.అలాగే సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసింది.

గురుకులాలలో విద్యార్థులు చనిపోయిన పేపర్ కటింగ్ ను షేర్ చేస్తూ ఈ పిల్లల ప్రాణాలు పోతే పట్టించుకోరు కానీ అల్లు అర్జున్ గురించి మాత్రం మాట్లాడుతారు అనే విధంగా ఈమె పోస్ట్ చేశారు.అదేవిధంగా అల్లు అర్జున్‌లో టాలెంట్ ఉన్నప్పుడు బలుపు ఉన్నా తప్పులేదనీ క్యాప్షన్ పెట్టి తగ్గేదెలా అని ఐకాన్ స్టార్ మ్యానరిజంను షేర్ చేసింది.

ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు అయితే మరి కొంతమంది అభిమానులు మాత్రం ఈమె చెప్పిన దాంట్లో తప్పేముంది అంటూ తనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube