టాలీవుడ్ స్టార్ హీరో సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vastunnam ) అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదలకు సిద్ధమయింది.
ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బాలకృష్ణ( Balakrishna ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వెంకటేష్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ప్రోమోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ కార్యక్రమంలో వెంకటేష్ బాలకృష్ణ ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.
ఇక ఈ కార్యక్రమానికి వెంకటేష్ తో పాటు తన అన్నయ్య సురేష్ బాబు కూడా హాజరయ్యారు.అనంతరం వారి తండ్రిని గుర్తు చేసుకొని కాస్త ఎమోషనల్ అయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో బాలకృష్ణ వెంకటేష్ కి కొన్ని ఫోటోలను చూపించారు ముఖ్యంగా తన ముగ్గురికి కూతుర్లతో కలిసి వెంకటేష్ దిగిన ఫోటోని చూపించడంతో వెంకటేష్ తన కూతుర్ల గురించి ఎంతో గొప్పగా చెబుతూ సంబరపడ్డారు.
తన కూతుర్ల ఫోటోలను చూసిన వెంకటేష్ మై వండర్ ఫుల్ డాటర్స్ ఆశ్రిత, హవ్య, భావన అంటూ పేర్లు చెప్పుకొచ్చారు.అలాగే చైతన్యతో దిగిన ఫోటోని కూడా బాలయ్య చూపించడంతో చైతన్య గురించి వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సాధారణంగా మనం మన పిల్లల్ని హగ్ చేసుకోవడం చాలా కామన్ కానీ చైతన్యను హగ్ చేసుకుంటే ఏదో ఒక తెలియని ఆనందం కలుగుతుందని నాగచైతన్య( Nagachaitanya ) గురించి వెంకటేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక వెంకటేష్ కు నాగచైతన్య స్వయానా మేనల్లుడు అనే సంగతి మనకు తెలిసిందే.మొత్తానికి బాలయ్య టాక్ షోలో వెంకటేష్ భారీ హంగామా చేశారని ప్రోమో వీడియో ద్వారా తెలుస్తోంది.
మరి ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది.