బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్( Boxing Day Test Match ) అంటే క్రికెట్ ప్రేమికులకు పండగలాంటి వేళ.ఈసారి మెల్‌బోర్న్( Melbourne ) వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా( India vs Australia ) నాలుగో టెస్టు మొదటి రోజు నుంచే అద్భుతమైన అంశాలతో ఆసక్తి రేపింది.
ఆస్ట్రేలియా తరుపున 19 ఏళ్ల యువ ఆటగాడు, డెబ్యూటెంట్ సామ్ కాంటాసాస్( Sam Konstas ) తన ఆరంభ మ్యాచ్‌ను మరపురానిదిగా మార్చుకున్నాడు.రివర్స్ స్కూప్, స్కూప్ షాట్లతో ఆకట్టుకుని అర్థశతకాన్ని సాధించాడు.
బుమ్రా బౌలింగ్ లో సిక్సర్ కొడుతూ తన ధాటిని చూపించాడు.కానీ అసలు హైలైట్, సామ్ కాంటాసాస్ ఇంకా విరాట్ కోహ్లి( Virat Kohli ) మధ్య జరిగిన ఘటన ఇప్పుడు చర్చినీయాంసంగా మారింది మారింది.
మ్యాచ్ 10వ ఓవర్ అనంతరం ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది.భారత సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్లిప్ ఫీల్డింగ్‌కి వెళ్తుండగా, కాంటాసాస్ క్రీజ్ మారుతున్న సమయంలో ఇద్దరి మధ్య చిన్న ఢీ జరిగింది.కోహ్లి శోల్డర్ కాంటాసాస్‌ను తాకడం, ఆ తరువాత ఇద్దరు కూడా ఒకరికొకరు ఏమాత్రం తగ్గకుండా మాటల యుద్ధానికి దిగడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.స్టంప్ మైక్ లో ఏమి రికార్డ్ కాలేదు కానీ, రిప్లేలో ఈ సంఘటనను చూపించారు.
వెంటనే అంపైర్లు, ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్ ఉస్మాన్ ఖ్వాజా ఇద్దరినీ శాంతింపజేశారు.దీనితో మ్యాచ్ మళ్ళీ పునఃప్రారంభమైంది.
సామ్ కాంటాసాస్ తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు.52 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసిన కాంటాసాస్, 65 బంతుల్లో 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.ముఖ్యంగా, బుమ్రా బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో 18 పరుగులు రాబట్టడం అతని ఆటతీరుకు వావ్ నెల చేసాడు.ఈ ఓవర్‌లో ఒక సిక్సర్, రెండు ఫోర్లు, కొన్ని డబుల్స్ ఉన్నాయి.
ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, బుమ్రా బౌలింగ్ లో మూడేళ్ల తర్వాత ఒక ఆటగాడు సిక్సర్ కొట్టాడు.ఇది కాంటాసాస్ కు పెద్ద అచివ్మెంట్ అని చెప్పవచ్చు.
మొత్తం మీద, బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు కోహ్లి, కాంటాసాస్ ఢీతో పాటు యువ ఆటగాడు తన ప్రతిభను నిరూపించుకోవడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.మొదటి రోజు నుంచే మ్యాచ్‌కి వచ్చిన ఉత్కంఠ దానిని మరింత ఆకర్షణీయంగా మార్చింది.
మరి మిగతా రోజుల్లో ఈ మ్యాచ్‌లో ఇంకెన్ని ఘటనలు జరుగుతాయో వేచి చూడాలి.