బరువు తగ్గి నాజూగ్గా మారాలనుకుంటున్నారా.. అయితే ఈ జ్యూస్ తీసుకోండి!

ప్రస్తుత రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా ఎంతో మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.శరీరానికి తగిన శ్రమ లేకపోవడం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పలు రకాల మందులు వాడకం తదితర కారణాల వల్ల శరీర బరువు అదుపు తగ్గుతుంది.

 If You Drink This Juice Regularly, You Will Lose Weight And Become Slim! Healt-TeluguStop.com

అధిక బరువు అనేది మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్ ( Heart attack, cancer )వంటి జబ్బులు ప్రమాదాన్ని పెంచుతుంది.అందుకే పెరిగిన బరువును తగ్గించుకునేందుకు, మళ్లీ నాజూగ్గా మారేందుకు తెగ ఆరాటపడుతుంటారు.

Telugu Fat, Tips, Healthy, Immune System-Telugu Health

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ చాలా బాగా సహాయపడుతుంది.నిత్యం ఈ జ్యూస్ ను ఒక గ్లాసు చొప్పున తాగితే చాలా వేగంగా వెయిట్ లాస్ అవుతారు.మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు సన్నగా తరిగిన పుచ్చకాయ ముక్కలు వేసుకోవాలి.

అలాగే అరకప్పు పైనాపిల్ ముక్కలు, అర కప్పు స్ట్రాబెర్రీ పండు( Strawberry ) ముక్కలు, నాలుగు పుదీనా ఆకులు మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Fat, Tips, Healthy, Immune System-Telugu Health

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను నేరుగా తీసుకోవచ్చు.లేదా స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని కూడా తాగవచ్చు.ఈ వాటర్ మెలోన్ పైనాపిల్ స్ట్రాబెరీ జ్యూస్ లో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ జ్యూస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.రోజూ ఉదయం వేళ ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే ఆకలి కోరికలు అణిచివేయబడతాయి.

శరీరంలో అదనపు కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.తద్వారా మీరు వెయిట్ లాస్ అవుతారు.

సన్నగా మారతారు.అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవడం బాడీ హైడ్రేట్ గా ఉంటుంది.

రోగ నిరోధక వ్యవస్థ( Immune system ) బలపడుతుంది.చర్మం తాజాగా మరియు కాంతివంతంగా మెరుస్తుంది.

మెదడు పనితీరు మెరుగు పడుతుంది.జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

అంతే కాకుండా ఈ వాటర్ మెలోన్ పైనాపిల్ స్ట్రాబెర్రీ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే కంటి చూపు షార్ప్ గా మారుతుంది.ఎముక‌లు మరియు దంతాలు సైతం స్ట్రాంగ్ గా మారతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube