టాలీవుడ్ హీరో ప్రభాస్( Tollywood hero Prabha )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఇటీవల కల్కి సినిమాతో( Kalki ) భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు.కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
కాగా డార్లింగ్ ప్రభాస్ సింప్లిసిటీ గురించి మనందరికీ తెలిసిందే.
పాన్ ఇండియా హీరో అయినప్పటికీ చాలా సింపుల్ గా కనిపిస్తూ అందరిని నవ్విస్తూ నవ్వుతూ ఉంటారు ప్రభాస్.ఇక చాలామంది సెలబ్రిటీలు ప్రభాస్ గురించి ఆయన సింప్లిసిటీ గురించి చాలా సందర్భాలలో చెప్పకొచ్చిన విషయం తెలిసిందే.తాజాగా అల్లు శిరీష్( Allu Sirish ) ప్రభాస్ పై చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన చిత్రం బడ్డీ.ఈ సినిమా జూలై 26న విడుదల కాబోతోంది.టెడ్డీబేర్‌తో ఒక యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా ప్రమోషన్స్ చాలా స్పీడ్‌గా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌కి శిరీష్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు.
అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్‌పై చేసిన కామెంట్స్ ఇన్ డైరెక్ట్‌గా అల్లు అర్జున్‌పై ( Directly Allu Arjun )వేసిన సెటైర్‌గా భావించిన బన్నీ ఫ్యాన్స్ శిరీష్‌పై ఫైర్ అవుతున్నారు.మీరు సెపరేట్‌గా పీఆర్ టీమ్‌ని పెట్టుకొని ప్రేక్షకులకు దగ్గరవ్వచ్చుగా అని అడిగిన ప్రశ్నకు శిరీష్ సమాధానమిస్తూ.వరసగా సినిమాలు చేస్తూ ఉంటే ప్రేక్షకులే మనల్ని గుర్తు పెట్టుకుంటారు.
అంతేతప్ప ప్రత్యేకంగా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు.మనం చేసిన సినిమాలే వారికి దగ్గర చేస్తాయి.
ఈ విషయంలో ప్రభాస్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి.సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ ప్రభాస్.
అతను నటించిన సినిమా సంవత్సరానికి ఒక్కటైనా రిలీజ్ అవుతుంది.అయినా ఆయన బయట కనిపించేది చాలా తక్కువ.
ఎలాంటి హంగు, ఆర్భాటం ఉండదు.తన సినిమాలను ప్రమోట్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ.
టీవీలో ప్రోగ్రామ్స్‌కి, ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వరు.ఇక తన సినిమాల ప్రమోషన్‌ని కూడా ఏదో నామమాత్రంగా చేసుకుంటారు అని తెలిపారు అల్లు శిరీష్.
ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు శిరీష్ పై మండిపడుతున్నారు.