టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమాలు( Sequel Movies ) తెరకెక్కడం కొత్తేం కాదు.మొదట హిట్ సినిమా టైటిల్ ను రిపీట్ చేస్తూ సినిమాలను తెరకెక్కించి చాలామంది దర్శకనిర్మాతలు చేతులు కాల్చుకున్నారు.
అయితే బాహుబలి2, పుష్ప2 మినహా టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ హిట్టైన సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి.ఫస్ట్ పార్ట్ హిట్టైతే మాత్రం సీక్వెల్ సినిమాలకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
ఈ రీజన్ వల్లే నిర్మాతలు సీక్వెల్స్ పై ప్రస్తుతం నిర్మాతలు దృష్టి పెట్టారు.ఫస్ట్ పార్ట్ ఎక్కడ ముగిసిందో అక్కడినుంచి సినిమాను తెరకెక్కించేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాబోయే రోజుల్లో టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలో సైతం ఎక్కువ సంఖ్యలో సీక్వెల్స్ దిశగా అడుగులు పడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
పుష్ప2 సినిమాకు కొనసాగింపుగా పుష్ప3( Pushpa 3 ) తెరకెక్కనుండగా దేవర సినిమాకు సీక్వెల్ గా దేవర2 తెరకెక్కనుంది.బాహుబలి2, ఆర్.ఆర్.ఆర్ సినిమాలకు సైతం సీక్వెల్స్ వచ్చే అవకాశం అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.జైలర్ సినిమాకు సీక్వెల్ గా జైలర్2,( Jailer 2 ) సలార్ సినిమాకు సీక్వెల్ గా సలార్2,( Salaar 2 ) కల్కి సినిమాకు సీక్వెల్ గా కల్కి2( Kalki 2 ) సినిమాలు తెరకెక్కుతున్నాయి.
రాబోయే రోజుల్లో మరిన్ని భారీ సినిమాలకు సీక్వెల్స్ దిశగా అడుగులు పడే ఛాన్స్ ఉంది.సీక్వెల్స్ సినిమాలు బిజినెస్ విషయంలో సైతం సంచలనాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్క్రిప్ట్ లో సత్తా ఉంటే సీక్వెల్స్ సైతం సంచానాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ సీక్వెల్స్ వల్ల రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.
టాలీవుడ్ హీరోలు సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రికార్డ్స్ క్రియేట్ అవుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.