సినిమా జనాలకు విపరీతంగా నచ్చాలంటే కనీవినీ ఎరుగని రీతిలో ట్విస్టులుండాలి.సీను సీనుకు కథ రకరకాల మలుపులు తిరగాలి.
అప్పుడే జనాలకు సినిమాపై ఇంట్రెస్ట్ మరింత పెరుగుతుంది.ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోవాలి.
సెకెండ్ ఆఫ్ లో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ రేపాలి.అలా చేసినప్పుడే సినిమా సక్సెస్ అవుతుంది.
సేమ్ ఇలాంటి ట్విస్టులతో అదరగొట్టాయి కొన్ని సినిమాలు.తెలుగులో అదరిపోయే ట్విస్టులున్న టాప్ 5 సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బాహుబలితెలుగులోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై అమాంతం ఇంట్రెస్టు పెంచిన అంశం కట్టప్ప బాహుబలిని చంపాడు అనే విషయం.ఈ ట్విస్టుతో బాహుబలి ఫస్ట్ పార్ట్ ను ఎండ్ చేశాడు దర్శకుడు రాజమౌళి.
రెండేళ్ల పాటు ఈ క్యూరియాసిటీతో ఎదురు చూశారు జనాలు.పార్ట్ 2లో దానికి కారణం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.రంగస్థలం
ఈ సినిమాలో చివరన వచ్చే ట్విస్ట్ అసలు ఊహించరు జనాలు.సినిమా అంతా ఫణీంద్ర భూపతిని విలన్ గా చూపిస్తారు.దక్షిణామూర్తిని మంచి వ్యక్తిగా ప్రొజెక్ట్ చేస్తారు.కానీ చివరకు కుమార బాబును చంపింది దక్షిణామూర్తి అని తెలుసుకుని ఆశ్చర్యపోతారు.ఈ సినిమాలో అద్భుత ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది.
పోకిరి
ఈ సినిమాలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి.పనీ పాటలేని పోకిరిగా సినిమాలో చాలా వరకు మహేష్ బాబును చూపించి చివరకు తనో ఐపీఎస్ ఆఫీసర్ అంటూ అద్భుత ట్విస్ట్ ఇస్తాడు.నాజర్ తన కొడుకు ఐపీఎస్ అంటూ చెప్తున్నతీరు గగుర్పాటుకు గురి చేస్తుంది.
కంచరపాలెం
వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిఫరెంట్ స్టోరీతో ముందుకు సాగుతుంది.ఒకే సారి 4 స్టోరీలు వెళ్తుంటాయి.చివరకు అవన్నీ ఒకే వ్యక్తికి చెందినవి అని సూపర్ ట్విస్ట్ ఇస్తాడు దర్శకుడు.
RX 100
ఈ సినిమాలో హీరోను హీరోయిన్ ప్రేమిస్తున్నట్లు చెప్పి మోసం చేయడం అసలు ట్విస్ట్.తొలిసారి ఓ హీరోయిన్ ను నెగెటివ్ గా చూపించి ట్విస్ట్ ఇస్తాడు దర్శకుడు.