నాటి బుల్లి తెర స్టార్సే.. నేటి పాన్ ఇండియా స్టార్స్.. ఇదెక్కడి ట్రెండ్ గురు?

సక్సెస్ అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుంది అన్నది అసలు చెప్పలేం గురు.సినిమా ఇండస్ట్రీలో అయితే ఎంత టాలెంట్ వున్నప్పటికీ సక్సెస్ కావాలి అంటే మాత్రం అది ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది.

 Serials Stars Turns Pan India Stars , Kgf Hero Yash, Kgf Cinema, Kgf Chapter 2,-TeluguStop.com

ప్రేక్షకులను ఎంత బాగా మెప్పిస్తే అంత క్రేజ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది.ఇలా ప్రేక్షకులను మెప్పించిన చిన్న హీరోల ఇక ఆ తర్వాత స్టార్ హీరోగా రాణించిన వారు చాలా మంది ఉన్నారు.

అంతే కాదు రాత్రికిరాత్రే ఊహించని రేంజ్ లో స్టార్డమ్ సంపాదించిన వారు కూడా చాలామంది ఉన్నారు.ఇక ఇప్పుడు ఈ లిస్టులో చేరిపోయాడు కేజిఎఫ్ హీరో యష్.

అప్పటివరకూ యష్ పెద్దగా ఎవరికీ తెలియదు.కానీ కే జి ఎఫ్ సినిమా విడుదల కావడం ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించడం తో ఇక యష్ ఒక్కసారిగా అందరికీ సుపరిచితుడిగా మారిపోయాడు.

కేవలం సౌత్ లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ప్రేక్షకుల కు తెలిసిన హీరోగా మారిపోయాడు.కే జి ఎఫ్ సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధిస్తుందని అటు దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఊహించి ఉండరు అని చెప్పాలి.

ఇటీవల విడుదలైన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా అంతకుమించిన విజయాన్ని సాధించి భారీగా వసూళ్లు సాధిస్తోంది.

Telugu Raghavendra Rao, Kgf Chapter, Kgf, Kgf Yash, Lambada Udigi, Pan India Sta

కే జి ఎఫ్ తో సక్సెస్ సాధించి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యష్ ఒకప్పుడు బుల్లితెర నటుడు అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు.ఇక సీరియల్స్ నుంచి ఇప్పుడు రాకింగ్ స్టార్ వరకు ఎదిగాడు.ఉత్తరాయణ అనే సీరియల్ తో యష్ ప్రస్థానం మొదలైంది.2004 నుంచి 2007 వరకు బుల్లితెరపై 2007లో లంబాడా ఉడిగి అనే కన్నడ సినిమాతో హీరోగా కెరియర్ ప్రారంభించాడు.గజకేసరి సినిమాతో మంచి హిట్ అందుకుని అందరికీ సుపరిచితులు గా మారాడు.

ఇక తెలుగులో దర్శకుడిగా దీరుడిగా ఉన్న రాజమౌళి సైతం కెరీర్ మొదలు పెట్టింది బుల్లితెర పైనే.కె రాఘవేంద్రరావు నిర్మించిన శాంతినివాసం సీరియల్ కు డైరెక్టర్గా వ్యవహరించారు.

తర్వాత రాఘవేంద్రరావు పర్యవేక్షణలో స్టూడెంట్ నెంబర్ వన్ తీసారూ ఆ తర్వాత రాజమౌళి ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా ఒకప్పుడు బుల్లి తెర స్టార్సే ఇక ఇప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా స్టార్లు గా కొనసాగుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube