ఏజెన్సీలో సీతాఫలాల ( Custard Apple )సీజన్ మొదలైంది.తీయని ఈ ఫలాలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.
ఇవి కొన్ని రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.ఈ పండే కాకుండా చెట్టు ఆకులు, బెరడు కూడా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
సీతాఫలం తీసుకుంటే కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే సీతాఫలంలో ఎన్నో రకాల పోషకాలతో పాటు విటమిన్లు కూడా ఉన్నాయి.
ఈ పండు తింటే రోగనిరోధక శక్తి ( Immunity )పెరుగుతుంది.విటమిన్ ఏ, విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి.

ఉదయాన్నే దీన్ని తినడం ద్వారా కండరాల, నరాల బలహీనతలు వంటి రుగ్మతలు తొలగిపోతాయి.శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.విటమిన్ ఏ ఇందులో ఎక్కువగా ఉండడంతో కంటి సమస్యలు( Eye problems ) దూరం అవుతాయి.మెగ్నీషియం, పొటాషియం, సోడియం సమపాళ్లలో ఉండడం వల్ల రక్తపోటును అదుపు చేసి గుండె సమస్యలు తలెత్తకుండా చేస్తుంది.
అలాగే పేరుకుపోయిన అధిక కొవ్వును ఇది కరిగిస్తుంది.గర్భిణీలు దీన్ని తినడం ద్వారా పుట్టబోయే బిడ్డ మెదడు చురుగ్గా ఉంటుంది.
క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా తోడ్పడుతుంది.బలహీనంగా ఉండే చిన్న పిల్లలకు సీతాఫలాలను ఎంత ఎక్కువగా తినిపిస్తే అంత మంచిది.

ఈ పండ్లను ఎక్కువగా తినడం ద్వారా రక్తహీనత ( Anemia )దూరమవుతుంది.కడుపులో మంట, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ పండ్లను ఎక్కువగా తినడం మంచిది.డైటింగ్ చేసేవారు క్రమం తప్పకుండా ఈ పండు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఎదుగుతున్న పిల్లలు నిత్యం తీసుకుంటే క్యాల్షియం లాంటి పోషకాలు అధికంగా లభిస్తాయి.
దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి.శరీరంలో ఉన్న వ్యర్ధ పదార్థాలను బయటకు పంపడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాగే రక్తన్ని కూడా శుద్ధి చేస్తుంది. సీతాఫలం శరీరమంతా రక్తప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తుంది.
ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది.ఇది గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా తోడ్పడుతుంది.