ఇటీవల రోజుల్లో ఎవరిని గమనించినా ముందు వారి బాన పొట్టే కనిపిస్తోంది.స్త్రీలే కాదు ఎంతో మంది పురుషులు కూడా బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారు.
ఆహారపు అలవాట్లు, గంటలు తరబడి కూర్చుని ఉండడం, శరీరానికి తగిన శ్రమ లేకపోవడం, ఒత్తిడి, మద్యపానం అలవాటు తదితర కారణాల వల్ల పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది.దీంతో నాజూగ్గా ఉండాల్సిన పొట్ట బానలా మారుతుంది.
మీరు కూడా బెల్లీ ఫ్యాట్ ( Belly fat )సమస్యతో సతమతం అవుతున్నారా.? అయితే చింతించకండి.
ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ డ్రింక్ ను నిత్యం కనుక తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు నెల రోజుల్లో కరిగిపోద్ది.మరి ఇంతకీ ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా అర అంగుళం పచ్చి పసుపు కొమ్మును ( Turmeric Fingers )తీసుకుని సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో పచ్చి పసుపు కొమ్ము తురుము వేసుకోవాలి.

అలాగే నాలుగు లేదా ఐదు దంచిన మిరియాలు ( Pepper )వేసి దాదాపు పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి, చిటికెడు పింక్ సాల్ట్ వేసి బాగా కలిపి గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.
రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ మిరాకిల్ డ్రింక్ ను తీసుకోవాలి.

నెల రోజుల పాటు వరుసగా ఈ డ్రింక్ ను తీసుకుంటే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. పొట్ట కొవ్వును కరిగించడానికి ఈ డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.నిత్యం ఈ డ్రింక్ ను తీసుకుంటే మీ బాన పొట్ట కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.
అలాగే ఈ డ్రింక్ ను డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుంది.బ్రెయిన్ మునుపటి కంటే షార్ప్ గా పని చేస్తుంది.
కీళ్ల నొప్పుల సమస్య సైతం దూరం అవుతుంది.