సాధారణంగా ఆడవారిలో చాలా మంది లాంగ్ హెయిర్( Long Hair ) ను ఇష్టపడుతుంటారు.జుట్టును పొడుగ్గా పెంచుకునేందుకు ఎంతో ఖరీదైన ఆయిల్, షాంపూ తదితర కేశ ఉత్పత్తులను వాడుతుంటారు.
అయినా సరే జుట్టు పొడుగ్గా పెరగడం లేదా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే మాస్క్ తో సులభంగా మరియు వేగంగా మీ షార్ట్ హెయిర్ ను లాంగ్ గా మార్చుకోవచ్చు.
అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకును( Aloevera ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో మూడు మందారం ఆకులు,( Hibiscus ) మూడు మందారం పువ్వులు వేసుకోవాలి.అలాగే కొన్ని ఫ్రెష్ తులసి ఆకులు( Tulsi Leaves ) మరియు ఒక కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

40 నిమిషాలు లేదా గంట అనంత అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ మాస్క్ వేసుకోవడం వల్ల బోలెడు బెనిఫిట్స్ లభిస్తాయి.ముఖ్యంగా మందారం పువ్వులు, మందారం ఆకులు, తులసి, అలోవెరా జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.
జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.షార్ట్ హెయిర్ ను కొద్ది రోజుల్లోనే లాంగ్ గా మారుస్తాయి.

అంతేకాకుండా ఈ మాస్క్ హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మారుస్తుంది.హెయిర్ ఫాల్ సమస్యను అరికడుతుంది.డ్రై హెయిర్ ను రిపేర్ చేస్తుంది.ఇక చాలా మంది తమ జుట్టు ముక్కలైపోతుందని.చివర్లు చిట్లిపోతుందని బాధపడుతుంటారు.అలాంటి వారు కూడా ఈ ఈ హెయిర్ మాస్క్ ను ప్రయత్నించవచ్చు.
తద్వారా హెయిర్ డ్యామేజ్ అనేది కంట్రోల్ అవుతుంది.







