అహోయి అష్టమి రోజు తల్లులు ఉపవాసం ఉంటే పిల్లలకు మంచిదా.. ఆరోజు ఏ తేదీ అంటే..

ప్రతి మహిళ తన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనుకుంటూ ఉంటారు.ముఖ్యంగా తన పిల్లలు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలంటే కొంత మంది మహిళలు ప్రత్యేక పండగల పుట కఠినమైన ఉపవాసాలు చేస్తూ ఉంటారు.

 Is It Good For Children If Mothers Fast On Ahoi Ashtami Day, Children , Mother-TeluguStop.com

మన దేశంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది.భారతదేశంలోని ప్రధాన పండుగల్లో అహోయి అష్టమి కూడా ఒక పండగ.

ప్రతి సంవత్సరం కార్తీక నెలలో కృష్ణపక్షంలోని అష్టమి తిథి నాడు ఈ పండుగను జరుపుకుంటారు.ఈ సంవత్సరం అహోయి అష్టమి అక్టోబర్ 17 న వస్తుంది.

ఈ అహోయి అష్టమి ఉపవాసం వెనకున్న అసలు కథ ఇప్పుడు తెలుసుకుందాం.ఈ ఉపవాసం ద్వారా తమ పిల్లలు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారని వారి తల్లులు నమ్ముతారు.

ఒక గ్రామంలో ఆ వడ్డీ వ్యాపారికి ఏడుగురు కొడుకులు ఉండేవారు.ఒకరోజు ఈ వ్యాపారీ భార్య ఇంటి గోడలను కట్టడానికి మట్టిని పారతో తొవ్వుతుండగా, పొరపాటున ఆ పార ఓ చిన్నారిపై పడి చిన్నారి అక్కడిక్కడే చనిపోతుంది.

నా చేతులతో నేనే చంపానని ఆ వడ్డీ వ్యాపారి భార్య ఎంతో ఏడ్చి బాధపడింది.అయితే కొంతకాలం తర్వాత ఆమె ఏడుగురు కొడుకుల్లో ఒకరు జబ్బు బారిన పడి కొన్ని రోజులకే చనిపోతాడు.

Telugu Ahoi Ashtami, Bhakthi, Devotional, Happiness, Mothers Fast-Latest News -

ఆ తర్వాత ఒక్కొక్కరు ఆరుగురు కొడుకులు కూడా అలాగే చనిపోతారు.నేను చేసిన ఆపాపం వల్లే నా కొడుకులు ఇలా చనిపోయారని ఆ తల్లి బాధపడుతుంది.విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఆడవారు నువ్వు అష్టమి నాడు ఉపవాసం ఉండి అహోయి మాతను పూజించమని చెప్తారు.ఆమె అలాగే అహోయి అష్టమి నాడు కఠిన ఉపవాసం చేస్తూ దేవతను పూజిస్తుంది.

ఈ పూజను మెచ్చిన అహోయి దేవత మళ్లీ తన కొడుకులను తిరిగి బతికిస్తుంది.అందుకే ప్రతి ఏడాది పిల్లల సుఖ సంతోషాలు, ఆనందం, దీర్ఘాయుష్షు కోసం తల్లులు ఈ రోజున నిష్టతో ఉపవాసం ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube