బ్యాటింగ్ లో నిరాశపరిచి..ఫీల్డింగ్ లో అదరకొట్టిన విరాట్ కోహ్లీ..!

భారత్ వేదికగా జరిగిన భారత్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్( India vs Afghanistan ) మధ్య జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్( T20 series ) భారత్ క్లీన్ స్వీప్ చేసి కైవసం చేసుకుంది.తాజాగా జరిగిన మూడవ టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచింది.

 Disappointing In Batting Virat Kohli Failed In Fielding , India Vs Afghanistan,-TeluguStop.com

మ్యాచ్ మొదటి నుంచి చివరి వరకు ప్రతిక్షణం ఉత్కంఠ భరితంగా సాగింది.మైదానంలో ఏ ఆటగాడు ఇలాంటి ప్రదర్శన చేస్తాడో అంచనాలు వేయడం కూడా కష్టం గా మారింది.

భారీ అంచనాలతో బరిలోకి దిగిన ప్లేయర్లు చెత్త ప్రదర్శనతో నిరాశపరిస్తే, ఎలాంటి అంచనాలు లేని ప్లేయర్లు మాత్రం మంచి ప్రదర్శన చేస్తున్నారు.

ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్ లో రెండు సూపర్ ఓవర్లు నిర్వహించగా చివరకు భారత్ ఘన విజేతగా నిలిచింది.

ఈ టీ20 సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్లలో విరాట్ కోహ్లీ ( Virat Kohli )కాస్త పర్వాలేదు అనిపించిన మూడవ టీ20 మ్యాచ్ లో మాత్రం డకౌట్ గా వెనుతిరిగాడు.దీంతో ఫ్యాన్స్ అంతా కాస్త నిరాశ చెందారు.

బ్యాటింగ్ లో నిరాశపరిచినప్పటికీ.ఫీల్డింగ్ లో మాత్రం అదరగొట్టి ఫ్యాన్స్ ను సంతోషపరిచాడు.

విరాట్ కోహ్లీ తన టీ20 కెరీర్ లో గోల్డెన్ డకౌట్ నమోదు చేసుకోవడం ఇదే తొలిసారి.ఇకపోతే 16వ ఓవర్లో జనత్ కొట్టిన బంతి సిక్స్ వెళ్లకుండా గాల్లోకి ఎగిరి మరి విరాట్ కోహ్లీ బంతిని ఆపాడు.దీంతో ఫ్యాన్స్ అరుపులతో మైదానం ఒక్కసారిగా దద్దరిల్లింది.

విరాట్ కోహ్లీ కు సొంత గడ్డ లాంటి బెంగుళూరు వేదికపై బ్యాటింగ్ తో నిరాశపరిచి, మెరుపు ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు.కోహ్లీ ఫ్యాన్స్ అంతా ఒక మ్యాచ్ లో డక్ అవుట్ అయితే ఏంటి విరాట్ కోహ్లీ ఎప్పటికీ కింగ్ కోహ్లీనే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube