కంటి కింద డార్క్ సర్కిల్స్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.. అయితే ఈ ఆహారాన్ని తినండి..

ఒకప్పుడు గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారి కన్నుల క్రింద నల్లటి మచ్చలు కనిపించేవి.కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ఫోన్లో, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకంతో చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.

 Are You Facing Problems With Dark Circles Under Your Eyes.. But Eat This Food, D-TeluguStop.com

జీవిత విధానంలో మార్పులు కూడా దీనికి కారణం అవుతున్నాయి.దీంతో డార్క్ సర్కిల్స్ కు ట్రీట్మెంట్ అంటూ బ్యూటీ పార్లర్లు ప్రచారాలు చేసుకుంటున్నాయి.

కానీ చాలామందిలో ఈ సమస్య పూర్తిగా తగ్గిపోదు.విటమిన్లు ఏ, బి, సి, ఈ ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకుంటే కళ్ళ చుట్టూ ఉన్న చర్మం శాంతిని కోల్పోకుండా ఉంటుంది.

ఈ పోషకాలు సెన్సిటివ్ స్కిన్ ను ప్రకాశవంతంగా చేస్తాయి.అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కంటి ఆరోగ్యాన్ని పెంచే బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుచ్చకాయ నుంచి శరీరానికి ఎక్కువగా లభిస్తుంది.

Telugu Beetroot, Dark Circles, Eyes, Tips, Vitamin, Watermelon-Telugu Health

అంతేకాకుండా పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, బి1, బి6, సి విటమిన్లు లాంటి ఇతర పోషకాలు కంటి కింద నల్లటి వలయాలను దూరం చేయగలవు.బీట్రూట్లో బీటాలైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.

ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.దీంతో శరీరంలోని వ్యర్ధాలు బయటకు పోతాయి.

అయితే బీట్రూట్ కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.దీనిలో ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం లాంటి పోషకాలు కంటి కింద నల్లటి వలయాలను దూరం చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి.

Telugu Beetroot, Dark Circles, Eyes, Tips, Vitamin, Watermelon-Telugu Health

ఇంకా చెప్పాలంటే దోసకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది.ఇది చర్మాన్ని రీ హైడ్రేట్ చేస్తుంది.దోసకాయను ఆహారంలో చేర్చుకుంటే కాంతి హీనంగా మారిన చర్మం తిరిగి మెరుపును సంతరించుకుంటుంది.ఇది కొల్లాజెన్ ఏర్పడడానికి మెరుగుపరుస్తుంది.వీటిలో ఏ, ఈ, సీ, కే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి.ఇవి రక్తనాళాలను శుద్ధి చేస్తాయి.

అందుకే దోసకాయను క్రమం తప్పకుండా తింటే కంటి కింద డార్క్ సర్కిల్స్ సమస్య దూరం అయిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube