శరీర బరువును తగ్గించే పానీయాల్లో గ్రీన్ టీ( Green tea ) అత్యంత ప్రసిద్ధి చెందింది.అందుకే వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారందరూ తప్పకుండా తమ డైట్ లో గ్రీన్ టీ ఉండేలా చూసుకుంటారు.
అయితే గ్రీన్ టీ బరువునే కాదు హెయిర్ ఫాల్ ను కూడా తగ్గిస్తుంది.కురుల ఆరోగ్యానికి అండగా ఉంటుంది.
గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ( Antioxidants , vitamins )మరియు మినరల్స్ ఉంటాయి, ఇవి జుట్టు రాలడాన్ని అరికట్టి జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.మరి ఇంతకీ కేశాలకు గ్రీన్ టీ ను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( fenugreek ) వేసి అవి మునిగేలా వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరోసారి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు ( Green tea leaves )వేసుకోవాలి.అలాగే నైట్ అంతా నానబెట్టుకున్న మెంతులు వాటర్ తో సహా వేసుకొని పది నుంచి 12 నిమిషాల పాటు ఉడికించాలి.
అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసి చల్లార పెట్టుకోవాలి.గోరువెచ్చగా అయ్యాక ఈ వాటర్ ను హెయిర్ టానిక్ లా ఉపయోగించాలి.
ఒక స్ప్రే బాటిల్( Spray bottle ) లో తయారు చేసుకున్న టానిక్ ను నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల జుట్టు రాలడం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.వెంట్రుకల కుదుళ్ళు దృఢంగా మారతాయి.అలాగే గ్రీన్ టీలోని విటమిన్ బి కంటెంట్ కురులకు తేమను అందిస్తుంది.జుట్టు చిట్లడాన్ని, విరగడాన్ని నియంత్రిస్తుంది.
అంతే కాకుండా గ్రీన్ టీ తో తయారు చేయబడిన ఈ టానిక్ స్కాల్ప్ ను క్లీన్ చేయడానికి, ఆయిల్ ఉత్పత్తిని కంట్రోల్ చేయడానికి మరియు స్కాల్ప్ ను డిటాక్సిఫై చేయడానికి కూడా అద్భుతంగా తోడ్పడుతుంది.