చేసిన ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు కాని ఇప్పుడు పత్తా లేకుండ పోయారు

సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం.ఆ రంగుల ప్రపంచంలో విహరించాలని ప్రతి ఒక్కరు కలలు కంటూ ఉంటారు.

 Tollywood Heroines Disappeared After One Big Hit-TeluguStop.com

ఆ కలల్ని నిజం చేసుకోవడానికి కొంతమంది సినిమా రంగం వైపు అడుగులు వేస్తారు.అలా చాలామంది హీరోయిన్ అవుదామని వచ్చి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుని, ఒకటి రెండు సినిమాలలో నటించి కనుమరుగైన వారు కూడా ఉన్నారు.

అలా ఒక ఏడాదిలో ఎంతోమంది హీరోయిన్లు వెండితెరకు పరిచయం అవుతారు.అలా కొద్ది సినిమాలు చేసి తర్వాత తెలుగు తెరకు దూరమైన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.

హీరోయిన్ రతి గుర్తుందా అండి.మొదట పల్లకిలో పెళ్లికూతురు సినిమా ద్వారా తెలుగులో పరిచయమైనది రతి.ఆ తర్వాత అల్లరి బుల్లోడు, సంక్రాంతి, సినిమాల్లో కనిపించింది.తను నటించింది కొన్ని సినిమాలే అయినా ఆ సినిమాలో తన నటనకు గాను ప్రజలు తనను గుర్తుపెట్టుకున్నారు.

అందరికీ గుర్తుంది. కానీ తర్వాత ఎక్కడా సినిమాల్లో కనిపించలేదు.

అలాగే బిందాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన షీనా పరిస్థితి కూడా అంతే.ఆ సినిమా తర్వాత ఒక రెండు మూడు తెలుగు సినిమాలు చేసినా కానీ అవి చెప్పుకోదగ్గ ఫలితం రాలేదు.2015 లో వచ్చిన గడ్డం గ్యాంగ్ తన చివరి తెలుగు సినిమా ఇంకా బన్నీ సినిమా తో తెలుగు తెరకి పరిచయమైన గౌరీ కూడా ఈ కోవలోకి చెందిన నటే.బన్నీ సినిమా తరువాత కొన్ని కన్నడ తెలుగు తమిళ్ సినిమాలు చేసింది.ఆ తర్వాత ఇంకా ఎక్కడా కనిపించలేదు.

Telugu Deeksha Seth, Disappeared, Heorine Sheena, Keerthi Chawla, Nikitha, Rathi

మీ అందరికి నాగర్జున నటించిన మన్మధుడు సినిమా గుర్తు ఉండే ఉంటుంది.ఆ సినిమా చూసిన ప్రతి వాళ్ళకి అన్షు పరిచయం అవసరం లేదు.ఒక్క సినిమాతోనే తను ఎంతో పాపులర్ అయిపోయింది.

తర్వాత ప్రభాస్ తో రాఘవేంద్ర లో నటించింది.ఆ తర్వాత ఎక్కడికి వెళ్లి పోయిందో ఎవరికీ తెలియదు.

అలాగే డైరెక్టర్ తేజ పరిచయం చేసిన ఎంతో మంది కొత్త నటులలో అనిత ఒకరు.నువ్వు నేను సినిమాతో పరిచయం అయిన తర్వాత ఎన్నో తెలుగు తమిళ్ సినిమాలు చేశారు.

తర్వాత తెలుగు తెరపై సడన్ గా మాయమైపోయి హిందీ తెరపై కనిపించారు.ప్రస్తుతం హిందీ సీరియల్ ఇండస్ట్రీ లో స్టార్ అయ్యారు.

Telugu Deeksha Seth, Disappeared, Heorine Sheena, Keerthi Chawla, Nikitha, Rathi

పవర్ స్టార్ పక్కన బాలు సినిమా ద్వారా నేహా ఒబెరాయ్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.ఆ సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు కూడా అందుకున్నారు.తర్వాత జగపతి బాబుతో బ్రహ్మాస్త్రం అనే సినిమా చేశారు.తర్వాత సినిమాల్లో నటించలేదు.మన అందరికి పరిచయం అక్కర్లేని హీరోయిన్ కీర్తి రెడ్డి.తొలిప్రేమతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు.

తర్వాత కొన్ని తెలుగు హిందీ తమిళ సినిమాల్లో నటించారు.అర్జున్ సినిమా తర్వాత మాయమైపోయారు.

ఆది సినిమా తో పరిచయమైంది కీర్తి చావ్లా.ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.2016లో తమిళ్ సినిమా చేసిన కీర్తి తర్వాత ఎక్కడా కనిపించలేదు.అలాగే ఇంకో హీరోయిన్ అంకిత గురించి తెలుసుకుంటే లాహిరి లాహిరి లాహిరి లో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది అంకిత.

ఎన్టీఆర్ కెరీర్లో ఉత్తమ చిత్రాలలో ఒకటి అయిన సింహాద్రి లో ఒక హీరోయిన్ గా నటించింది.

Telugu Deeksha Seth, Disappeared, Heorine Sheena, Keerthi Chawla, Nikitha, Rathi

ఈ కోవలోకి చెందిన హీరోయిన్లలో నికిత ఒకటి.హాయ్, సంబరం, డాన్ అనసూయ, చింతకాయల రవి ఇలాంటి ఎన్నో సినిమాల్లో నటించింది నికిత.2016 లో వచ్చిన టెర్రర్ తన చివరి తెలుగు సినిమా.మాస్టర్ సినిమాలో చిరంజీవి పక్కన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కనిపించే హీరోయిన్ గుర్తుందా? తనే రోషిని.అప్పట్లో స్టార్ హీరోయిన్ అయిన నగ్మా చెల్లెలు.

తర్వాత పవిత్ర ప్రేమ సినిమాలో బాలకృష్ణతో నటించింది.శుభలేఖలు తన ఆఖరి తెలుగు సినిమా.

అలాగే దీక్షా సేత్ మిస్ ఇండియా ఫైనలిస్ట్ అయిన దీక్ష తన మొదటి సినిమానే అల్లు అర్జున్ తో చేసింది.రవితేజ, గోపీచంద్ విక్రమ్, ప్రభాస్ లాంటి పెద్ద హీరోలతో నటించింది.

రెబల్ తెలుగులో తను చేసిన చివరి సినిమా.అలాగే ఆరెంజ్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్ లో నటించిన రూప అసలు పేరు షాజహాన్.

షాజహాన్ తన సొంత పేరు కంటే రూప పేరుతోనే ఎక్కువగా పాపులర్ అయింది.ఆరెంజ్ తర్వాత హిందీలో దిల్ తో బచ్చా హై జీ, హౌస్ ఫుల్ టు సినిమాల్లో చేసింది.

తర్వాత మళ్ళీ తెలుగులో మసాలా సినిమాలో రామ్ కి జోడీగా కనిపించింది.అదే తన ఆఖరి సినిమా.

ఇలా చాలామంది హీరోయిన్స్ కొన్ని సినిమాలు మాత్రమే చేసి,ఒక గుర్తింపు సంపాదించుకుని, తరువాత కనుమరుగై పోయారు.!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube