తైవాన్‌లో( Taiwan ) జరిగిన ఒక షాకింగ్ ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది.57 ఏళ్ల వయసున్న ల్వ్ ( LV ) అనే వ్యక్తి, తన మాజీ ప్రేయసి తనతో మళ్లీ కలిసి ఉండాలనే కోరికతో ఒక వింత పని చేశాడు.ఆమె తండ్రి అస్థికలను దొంగిలించాడు.
ల్వ్, టాంగ్ అనే మహిళ గత 15 ఏళ్లుగా ప్రేమించుకున్నారు.
కానీ, 2023లో టాంగ్( Tang ) అతనికి బ్రేకప్ చెప్పింది.ల్వ్ అప్పులు పెరిగిపోవడం, ప్రతి చిన్న విషయానికి తన కుటుంబం సహాయం కోరుతుండటంతో ఆమె విసిగిపోయింది.
బ్రేకప్( Breakup ) తర్వాత అతడితో పూర్తిగా మాట్లాడటం మానేసింది.కానీ ల్వ్ మాత్రం బ్రేకప్‌ను అంగీకరించలేకపోయాడు.
తిరిగి తనని ప్రేమించాలని వేడుకుంటూ, బెదిరిస్తూ, వేధిస్తూ ఆమె చుట్టూ రెండేళ్లు తిరిగాడు.

2023, మేలో, ల్వ్ జిజి జిల్లాలోని వుఝి మౌంటైన్ మిలిటరీ స్మశానవాటికకు వెళ్లడం మొదలుపెట్టాడు.టాంగ్ తండ్రి అస్థికలను ఇక్కడే ఒక కుండలో భద్రపరిచారు.ఆగస్టులో, అతను ఎలాగోలా ఆ కుండను దొంగిలించాడు.
వెంటనే ఏం చెప్పలేదు.కానీ డిసెంబర్‌లో, అతను టాంగ్ ఇంటికి వెళ్లి ఆమె తండ్రి ఫోటోను బయట వదిలిపెట్టి, సైలెంట్‌గా వార్నింగ్ ఇచ్చాడు.
టాంగ్ ఫోటో చూసింది కానీ కుండ మిస్సయిన విషయం ఆమెకు తెలియలేదు, అందుకే ఆమె స్పందించలేదు.

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, వాలెంటైన్స్ డేకి( Valentines Day ) కొంచెం ముందు, సీన్ మరింత సీరియస్‌గా మారింది.టాంగ్‌కు ల్వ్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది.అందులో దొంగిలించిన అస్థికల కుండ ఫోటోలు, భయానకమైన మెసేజ్ ఉన్నాయి.
ఆమె తనతో మళ్లీ కలిసి ఉండేందుకు ఒప్పుకోకపోతే, ఆమె తన తండ్రిని “మళ్ళీ చూడలేదని” బెదిరించాడు.ఈసారి టాంగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు, మిలిటరీ అధికారులు స్మశానవాటికను చెక్ చేయగా, కుండ ఉన్న కంపార్ట్‌మెంట్ సీల్ పగలగొట్టినట్లు గుర్తించారు.కుండ, ఫలకం మాయమయ్యాయి.
మరింత విచారణలో, మోసం, మనీలాండరింగ్ కేసులో అప్పటికే జైలులో ఉన్న ల్వ్, ఆ కుండను తన కోళ్ల ఫారమ్‌లో దాచిపెట్టినట్లు తేలింది.మార్చి 28న పోలీసులు దానిని కనుగొని టాంగ్‌కు తిరిగి ఇచ్చేశారు.
ల్వ్ ఇప్పుడు దొంగతనం, మానవ అవశేషాలను అపవిత్రం చేయడం, నేరపూరిత బెదిరింపులతో సహా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.ఆన్‌లైన్‌లో ప్రజలు షాక్ అయ్యారు.చాలా మంది అతని చర్యలను “పిచ్చి”, “స్వార్థపూరితం” అని అన్నారు, అతను చేసింది ప్రేమ కాదని, పిచ్చి అని విమర్శించారు.