టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో కేతిక శర్మ( Ketika Sharma ) ఒకరు.కేతిక శర్మ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.
రాబిన్ హుడ్ సినిమాలో( Robinhood Movie ) కేతిక శర్మ అది దా సర్ప్రైజ్ సాంగ్ చేయగా ఆ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానొ ఆకట్టుకుంది.ఈ సాంగ్ హుక్ స్టెప్ నెట్టింట ఒకింత హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
అయితే హీరోయిన్ ఆఫర్లు రాకపోవడంతో కేతిక ఐటమ్ సాంగ్( Ketika Item Song ) చేసిందా అనే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉండగా కేతిక శర్మ ఆ కామెంట్ల గురించి రియాక్ట్ అయ్యారు.కొరియోగ్రాఫర్ డ్యాన్స్ మూమెంట్స్ చెప్పిన సమయంలో లోతుగా ఆలోచించనని వాళ్లు చెప్పినవి చెప్పినట్టు చేయగలనా లేదా అనేదానిపై మాత్రమే నా ఫోకస్ ఉంటుందని కేతిక శర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.

హీరోయిన్ గా ఆఫర్లు రాక ఐటమ్ సాంగ్ చేయలేదని ఈ మధ్య కాలంలో ఐటమ్ సాంగ్ దేశవ్యాప్తంగా పాపులారిటీని తెచ్చిపెడుతోందని కేతిక శర్మ వెల్లడించారు.ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ వరకు చదివానని 16 సంవత్సరాల వయస్సులోనే థగ్స్ అనే మ్యూజిక్ ఆల్బమ్ తో ఎంట్రీ ఇచ్చానని కేతిక శర్మ పేర్కొన్నారు.అమ్మానాన్న డాక్టర్స్ అని ఆమె పేర్కొన్నారు.డబ్ స్మాష్ వీడియోల ద్వారా రొమాంటిక్ మూవీలో ఆఫర్ వచ్చిందని కేతిక తెలిపారు.

రొమాంటిక్ మూవీ లాస్ట్ డే షూటింగ్ ను అస్సలు మరిచిపోలేనని ఆరోజే లక్ష్య సినిమాలో ఆఫర్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు.ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే రెండో మూవీలో ఆఫర్ వచ్చిందని కేతిక శర్మ వెల్లడించారు.సాయితేజ్, వైష్ణవ్ తేజ్ తో కలిసి నటించిన సమయంలో చాలా ఎంజాయ్ చేశానని ఆమె పేర్కొన్నారు.ఆ సమయంలో చాలా థ్రిల్ గా ఫీలయ్యానని కేతిక తెలిపారు.