ఇటీవల ఉగాది పండుగకు కానుకగా విడుదలైన సినిమాలలో మ్యాడ్ స్క్వేర్( Mad Square ) సినిమా కూడా ఒకటి.ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి లాభాలను అందుకుంది.ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించిన సందర్బంగా మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే అందులో భాగంగానే రెండో వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోవడానికి ఒక విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు నిర్మాత నాగవంశీ.

అయితే దీనికి మరింత పుష్ ఇచ్చేందుకు స్టార్ హీరో ఎన్టీఆర్( NTR ) ని అలాగే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ను తీసుకొచ్చారు.విరిద్దరూ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇచ్చిన స్పీచ్ బాగా హైలెట్ అయ్యింది.
మ్యాడ్ స్క్వేర్ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరినీ పేరు పేరున అభినందించారు ఎన్టీఆర్.అయితే ఈ ఈవెంట్లో మరో రకంగా కూడా ఎన్టీఆర్ హాట్ టాపిక్ అయ్యారు.
అదేమిటంటే మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్.తన బావమరిది నార్నె నితిన్( Narne Nithin ) పక్కన కూర్చుని ఏదో తాగుతున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.కొంతమంది ఎన్టీఆర్ మద్యం సేవిస్తున్నట్టు అపోహ పడుతూ సోషల్ మీడియాలో రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.అయితే చూడటానికి ఆ బాటిల్ కూడా అలానే కనిపిస్తోంది.అయితే అందరూ అనుకుంటున్నట్టు అది మద్యం బాటిల్ కాదు.అది మినరల్ వాటర్ బాటిల్. దాని పేరు రిఫ్రెషింగ్ పెరియార్ స్పర్క్లింగ్ నేచురల్ మినరల్ వాటర్ అని తెలుస్తోంది.
డైట్ లో ఉన్న వాళ్ళు ఈ వాటర్ తీసుకుంటారట.వీటిలో కేలరీలు ఉండవట.
చాలా ప్యూర్ వాటర్ అని తెలుస్తోంది.కాగా ఈ బాటిల్ ధర రూ.480 అని తెలుస్తోంది.ఒక కేస్ కి 12 బాటిల్స్ వరకు వస్తాయి.మొత్తంగా రూ.5760 అవుతుందని స్పష్టమవుతోంది.ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వార్త విన్న అభిమానులు ఊపిరి పీల్చు కుంటున్నారు.